YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం దేశీయం

రాష్ట్రాల సీఎంలతో ప్రధాని సమావేశం

రాష్ట్రాల సీఎంలతో ప్రధాని సమావేశం

న్యూఢిల్లీ, ఆగస్టు11
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీకి తెలిపారు. మంగళవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కేసీఆర్‌ ప్రధానికి రాష్ట్రంలో కరోనా కేసుల స్థితిని వివరించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను బాగా పెంచామని చెప్పారు. కరోనా రికవరీ రేటు తెలంగాణలో 71శాతం, మరణాల రేటు 0.7శాతంగా ఉందని వివరించారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. పడకలు, మందులు, ఇతర పరికరాలు, సామగ్రి సిద్ధంగా ఉంచామని, ఐసీఎంఆర్‌, నీతిఆయోగ్‌, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నామని ప్రధానికి వివరించారు.కరోనా అనుభవాలు మనందరికీ పాఠం లాంటిది నేర్పాయని కేసీఆర్ మోదీతో అన్నారు. ఈ క్రమంలో దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వైద్య రంగంలో భవిష్యత్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలోనూ విజనరీతో ఆలోచించాలని కేసీఆర్ సూచించారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి ఈ ప్రణాళిక అమలు చేయాలని మోదీకి సీఎం విజ్ఞప్తి చేశారు.‘కరోనా వైరస్‌లాంటివి భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఉంది. వైద్య రంగంలో ఏ విపత్కర పరిస్థితి తలెత్తినా తట్టుకునేలా చర్యలు తీసుకోవాలి. జనాభా నిష్పత్తి ప్రకారం వైద్యులను నియమించడంతో పాటు, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుపైనా ఆలోచించాలి. వైద్య రంగం బలోపేతానికి చొరవ తీసుకోవాలి. వైద్య రంగంలో ఏ విపత్కర పరిస్థితి తలెత్తినా సరే తట్టుకునే విధంగా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి’’ అని కేసీఆర్‌ కోరారు.
 

Related Posts