YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

గుట్టు చప్పుడు కాకుండా గుట్కా వ్యాపారం

గుట్టు చప్పుడు కాకుండా గుట్కా వ్యాపారం

ర్నూలు ఆగస్టు 13 
కర్నూలు జిల్లా ప్రధాన నగరానికి సుదూరంగా,కర్ణాటక సరిహద్దులకు అతిదగ్గరగా ఉండే మండలం కౌతాళం.అదే అంశం నిషేధిత కర్ణాటక మద్యం,గుట్కాలను గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలోకి స్మగ్లింగ్ చేసి నాలుగింతల అధికరేట్లకు అమ్మి సొమ్ము చేసుకోవడానికి సువర్ణావకాశంగా మారింది.అసలే విలేఖరులు,ఆపై పోలీస్ స్టేషన్ తో,పోలీసులతో,వివిధ శాఖల ప్రభుత్వాధికారులతో,రాజకీయ నాయకులతో సన్నిహిత పరిచయాలు ఉండనే ఉన్నాయి.ఇక ఇలాంటి సువర్ణావకాశాన్ని ఊరికే వదులుకుంటారా?!.నిషేధిత గుట్కాను కర్ణాటక రాష్ట్రం నుంచి బాపురం చెక్ పోస్ట్ మీదుగా కౌతాళంకు తెప్పించి కౌతాళం నుంచి సమీప పట్టణం అదోనికి చేరవేసి అక్కడి నుండి అమ్మకాలు సాగిస్తున్నట్టు సమాచారం.
కౌతాళం ఎస్సై వివరణ :- ఈ విషయంపై కౌతాళం ఎస్సై నాగార్జునరెడ్డి ని వివరణ కోరగా,రోజువారీ విధుల్లో భాగంగా బాపురం చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు చేస్తుండగా ఒక ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 31,000/- (ముప్పైఒక్కవేల రూపాయల) విలువైన నిషేధిత గుట్కా పాకెట్స్ ఉన్న బ్యాగ్ ను స్వాధీనం చేసుకుని విచారించగా కౌతాళంకు చెందిన వ్యాపారులు (వీరిలో ఒకరు ఒక దినపత్రిక విలేఖరి) అనే ఇద్దరు అన్నదమ్ములకు డెలివరీ ఇవ్వడానికి తెచ్చినట్టు ఒప్పుకోవడం జరిగింది.ఆ ఇద్దరినీ స్టేషన్ కు పిలిపించి విచారించగా,సదరు గుట్కాను అదోనిలో ఉండే తమ సమీప బంధువుకు పంపడానికి తెప్పించినట్టు ఒప్పుకోవడంతో కర్ణాటక నుంచి నిషేధిత గుట్కాను రవాణాచేసిన ఇద్దరు,కౌతాళంకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు మరియు అదోనికి చెందిన వారి సమీప బంధువు మొత్తం ఐదుగురిపై కేసు నమోదుచేసి ఇద్దరు నిందితులకు స్టేషన్ బెయిల్ మంజూరు చేసినట్టు తెలిపారు.
కాగా,కేసు కట్టి వారం రోజులు కావస్తున్నా కౌతాళం ఎస్సై నాగార్జునరెడ్డి ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టకపోవడం.నిందితులను,స్వాధీనం చేసుకున్న సరుకును హాజరుపరచక పోవడంతో  కౌతాళం ప్రజలు గుంపులు  చర్చించుకుంటున్నారు.

Related Posts