YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

ఇమ్యూనిటీ పెంచే టీ రెడీ...

ఇమ్యూనిటీ పెంచే టీ రెడీ...

హైద్రాబాద్, ఆగస్టు 13 
మనలో టీ అంటే తెలియని వారూ, టీ తాగని వారు ఉండే అవకాశం తక్కువ. మనందరికీ వేడి వేడి చాయ్ అంటే ఇష్టమే. మరీ ముఖ్యంగా ఇలా వానలు పడుతున్నప్పుడు వేడి వేడి టీ ఇచ్చే మజానే వేరు. కొంత మందికి టీ ఒక వ్యసనంలా మారిపోతుంది. అతి సర్వత్ర వర్జయేత్ అన్నది టీ విషయంలో కూడా కరక్టే. అయితే, ఈ టీ తాగడం కొంత తగ్గిద్దామనుకునే వారికి హెర్బల్ టీలు బాగా ఉపయోగపడతాయి.హెర్బల్ టీ ట్రూ టీ కాదు. అంటే ఇందులో టీ ఆకులు ఉండవు. హెర్బల్ టీ లో తినడానికి పనికొచే ఆకులూ, పువ్వులూ, పళ్ళూ, వేర్లూ ఉంటాయి. వీటితో పాటూ కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసి వాటిని మరగబెట్టి ఆ డికాషన్ తో తయారు చేసేదే హెర్బల్ టీ. హెర్బల్ టీలు కొన్ని వందల రకాలుగా అందుబాటులో ఉంటాయి. మీరు నివసించే ప్రదేశాన్ని బట్టి హెర్బల్ టీ లో వెరైటీలు ఉంటాయి. అంటే, మన దగ్గర దొరికే కరివేపాకుతో కూడా టీ చేసుకోవచ్చన్న మాట.టీ రుచిగా ఉండాలి, కానీ, హెల్దీ గా ఉండాలి అనుకునే వారికి హెర్బల్ టీలు మంచి ఆప్షన్. కాఫీ, ట్రూ టీ లో లాగా హెర్బల్ టీలో కెఫీన్ ఉండదు. చాలా హెర్బల్ టీ లలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి, కానీ వీటి శాతం టీలో వాడే పదార్ధాన్ని బట్టి మారుతుంది. హెర్బల్ టీ కి ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఇప్పుడు చూసేద్దాం.
1. టాక్సిన్స్ ని బయటికి పంపుతాయి. హెర్బల్ టీలు కిడ్నీ, లివర్ మీద ఒత్తిడి తగ్గించి అక్కడ పేరుకున్న టాక్సిన్స్ ని బయటికి పంపేస్తాయి. గ్రీన్ టీ, హైబిస్కస్ టీ ఇందుకు బాగా పని చేస్తాయి.
2. నిద్రలేమిని పోగొడతాయి. యాంగ్జైటీ ని తగ్గించి, మనసునీ, శరీరాన్నీ ప్రశాంతంగా చేసి హాయిగా నిద్ర పట్టేటట్లు చేస్తాయి. చామోమిల్ టీ, లావెండర్ టీ ఇందుకు బాగా పని చేస్తాయి.
3. నొప్పిని తగ్గిస్తాయి. కొన్ని హెర్బల్ టీలు ఎనాల్జెసిక్ గా పని చేస్తాయి. చామోమిల్, యూకలిప్టస్ టీలు ఇందుకు బాగా పని చేస్తాయి.
4. ఇన్‌ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి. అందువల్ల తలనొప్పి నుండి ఆర్థ్రైటిస్ వరకూ అనేక సమస్యలని కంట్రోల్ చేయవచ్చు జింజర్ టీ, టర్మరిక్ టీ ఈ పర్పస్ కి బాగా పనికొస్తాయి.
5. ఒత్తిడి తగ్గిస్తాయి. యాంగ్జైటీ ని తగ్గించి డిప్రెషన్ రాకుండా చూస్తాయి. చామోమిల్ టీ, కావా రూట్ టీ ఈ పర్పస్ కి బాగా పనికొస్తాయి.
6. క్రానిక్ డిసీజెస్ రాకుండా చేస్తాయి. హెర్బల్ టీలు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి శరీరం లో ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి. పెప్పర్మింట్ టీ ఇందుకోసం వాడతారు.
7. అరుగుదలకి సహకరిస్తాయి. ఇన్‌డైజెషన్, క్రాంపింగ్, బ్లోటింగ్, వికారం, కాన్‌స్టిపేషన్ వంటి వాటికి హెర్బల్ టీలు విరుగుడుగా పని చేస్తాయి. చామోమిల్ టీ, పెప్పర్మింట్ టీ, జింజర్ టీ, సినమన్ టీ ఇందుకోసం పనికొస్తాయి.
8. బ్రెయిన్ హెల్త్ బాగుండేలా చేస్తాయి. బ్రెయిన్ మీద ఒత్తిడి తగ్గించి ఫోకస్, కాన్సంట్రేషన్ పెరిగేలా చేస్తాయి. ఇందుకోసం తీసుకోవాల్సినవి జింజర్ టీ, మింట్ టీ, డాండిలయన్ టీ.ఇక్కడ వంటింట్లో సామాన్యంగా ఉండే పదార్ధాలతో ఎంతో రుచిగా ఉండే హెర్బల్ టీ ని పరిచయం చేస్తున్నాం.
కావాల్సిన పదార్ధాలు..
1. సన్నగా తరిగిన లెమన్ గ్రాస్ వేర్లు - రెండు మూడు ఇంచులు
2. దాల్చిన చెక్క - రెండు అంగుళాలు
3. యాలకులు - ఆరు
4. అల్లం - అరంగుళం ముక్క
5. నీరు - రెండు కప్పులు
6. బెల్లం - ఒక టీ స్పూన్ (కావాలనుకుంటేనే)

Related Posts