YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

ఐపీఎల్... చాలా కాస్ట్లీ గురూ...

ఐపీఎల్... చాలా కాస్ట్లీ గురూ...

ముంబై, ఆగస్టు 15, 
క్రికెట్ క్రీడ అంటేనే చాలా ఖరీదైంది. ఆటగాళ్ళ రెమ్యూనరేషనే ఎక్కువగా వుంటుంది. అలాగే లైవ్ సందర్భంగా కంపెనీల యాడ్స్ కూడా చాలా ఖరీదైనవి.  దేశంలో కోవిడ్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా చాలా ఈవెంట్లు రద్దయ్యాయి. ఈ క్రమంలో ఐపీఎల్ 2020 హంగామా మరికొద్ది రోజుల్లోనే మొదలు కాబోతోంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ జరగనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది.
కరోనా కట్టడికోసం.. ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించడంలేదు. దీంతో టీవీల్లో వ్యూవర్‌షిప్‌ రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్టార్‌స్పోర్ట్స్‌ 10 సెకన్ల యాడ్‌కి రూ.10 లక్షల ధరని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మధ్యలోనే దసరా, దీపావళి కూడా వస్తుండటంతో.. యాడ్స్‌ ఇచ్చేందుకు కంపెనీలు కూడా పోటీపడే అవకాశం ఉంది. ఐపీఎల్ 2019 సీజన్‌లో యాడ్స్‌ ద్వారా స్టార్‌స్పోర్ట్స్ రూ.3000 కోట్లు ఆదాయం ఆర్జించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే గత ఏడాది డిసెంబరులోనే ఐపీఎల్ ఆటగాళ్ళ వేలం జరిగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ భారీ ధర పలికాడు. ఈసారి వేలంలో అత్యధిక ధర పలికి ఆటగాళ్లలో ఒక్కడిగా నిలిచాడు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో బరిలోకి దిగిన అతనికి అత్యంత భారీ ధర పలికింది. రూ.15.50 కోట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్ అతడిని కొనుగోలు చేసింది.పేసర్ కమిన్స్ ను దక్కించుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు చాలా ఆసక్తి చూపించాయి. కోల్‌కతా అతడిని దక్కించుకుంది. అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కమిన్స్ కోసం గట్టి పోటీనిచ్చిన సంగతి తెలిసిందే. ఒకదశలో తన దేశానికే చెందిన గ్లెన్ మ్యాక్స్ సాధించిన రూ.10.75 కోట్లను దాటిన కమిన్స్‌ను ఆఖరివరకు పోరాడి కోల్‌కతా చేజిక్కుంచుకుంది. ఇంత ఖరీదైన ఆట కాబట్టే ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ పట్టుబట్టింది. కరోనా వేళ అనేక జాగ్రత్తలు తీసుకుని యుఏఇలో ఈ క్రీడకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు స్పాన్సర్ షిప్ బిడ్ కూడా భారీగానే వుండనుంది.

Related Posts