YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా వింతలు దేశీయం

మేల్ ప్రెగ్నెన్సీపై సినిమా

మేల్ ప్రెగ్నెన్సీపై సినిమా

ముంబై, ఆగస్టు 18, 
సినిమా ఇండ్రస్టీలో రోజురోజుకు ట్రెండ్ మారుతోంది. కొత్త కొత్త కథలు, కాన్సెప్టలతో సినిమాలు తీసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా కొత్త కథలతో వస్తున్నారు. సినిమాల విషయంలో కూడా ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఇప్పటికే యాక్షన్ , ఫ్యామిలీ , పీరియాడిక్ , యానిమేషన్ అంటూ అన్ని రకాల సినిమాలు వచ్చాయి . అయితే ఈ మధ్య బోల్డ్ కంటెంట్లకు కూడా ఆదరణ పెరిగింది. అందుకే వీటిపై వెబ్ సిరీస్ కాకుండా సినిమాలు కూడా వస్తున్నాయి. జనం ఆలోచనల్లో వస్తున్న మార్పులతోనే కొంతమంది కొత్త కొత్త ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.ముఖ్యంగా బాలీవుడ్ జనాలు బోల్డ్ కంటెంట్ ఆదరిస్తారు. ఇటు ఫ్యామిలీ కంటెంట్ ఆదరిస్తారు. అయితే ఇక ఆడవారి ప్రెగ్నెన్సీ గురించి సినిమాలు రూపొందించిన బాలీవుడ్ మేకర్స్ త్వరలో 'మేల్ ప్రెగ్నెన్సీ' అంటే మగవారు గర్భం దాల్చడం పై సినిమా తీయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త దేశమంతా వైరల్ అవుతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో జనాలలో కూడా ఆసక్తి మొదలైంది. ప్రముఖ హాకీ క్రీడాకారుడు సందీప్ సింగ్ జీవిత కథను తెరకెక్కించిన షాద్ అలీ ఈ మూవీని తెరకెక్కించనున్నారు.అయితే ఈ సినిమాలో దిల్జీత్‌ సింగ్‌.. నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు జరగుతున్నాయి. అయితే ఈ కథా నేపథ్యంలో ఇప్పటికే పంజాబీలో ఓ మూవీ రాగా.. ఆ చిత్ర రీమేక్ కాదని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఇక ఇందులో యువ హీరోయిన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాకు సంబంధించిన మిగతా అప్ డేట్స్ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే

Related Posts