YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

బ్రెజిల్‌లో 3,605,783కు చేరుకున్నకరోనా కేసులు కేసులు సంఖ్య

బ్రెజిల్‌లో 3,605,783కు చేరుకున్నకరోనా కేసులు కేసులు సంఖ్య

బ్రసిలియా ఆగస్టు 24, 
బ్రెజిల్‌లో కరోనా కేసులు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రతిరోజు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 23,431 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసులు సంఖ్య 3,605,783కు చేరుకుందని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. గడిచిన 24 గంటల్లో 494 మంది వ్యాధి బారిన పడి మృతిచెందగా మొత్తం మరణాల సంఖ్య 114,744కు చేరింది. శుక్రవారం 50,000 కేసులు నమోదు కాగా 900 మంది మరణించారు. శనివారం 30,000 కరోనా కేసులు నమోదు కాగా 1,045 మంది వ్యాధి బారిన పడి మరణించారు. ఇప్పటివరకు దేశంలో 27లక్షలకు పైగా కరోనా నుంచి కోలుకున్నారు.

Related Posts