YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ఐదు ఆస్పత్రులపై వేటు

ఐదు ఆస్పత్రులపై వేటు

విజయవాడ, ఆగస్టు 26 
ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లపై ఏపీ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. విజయవాడలో ఐదు కోవిడ్ కేర్ సెంటర్లకు అనుమతిని రద్దు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నారని రమేష్ హాస్పిటల్స్ వారి స్వర్ణ హైట్స్, డాక్టర్ లక్ష్మీ నర్సింగ్ హోమ్ వారి ఎనికేపాడులో హోటల్ అక్షయ ఇండో బ్రిటిష్ హాస్పిటల్ వారి బెంజ్ సర్కిల్‌లో హోటల్ ఐరా ఎన్‌ఆర్ఐ హీలింగ్ హాండ్స్ హాస్పటల్స్ వారి సన్ సిటీ, కృష్ణ మార్గ్ రోగుల నుంచి అందిన ఫిర్యాదుల రావడంతో విచారణ నిర్వహించారు.. అనుమతులు రద్దు చేశారు.రెండు వారాల క్రితం విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన రమేష్ కోవిడ్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10మంది చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న రమేష్ ఆసుపత్రి చైర్మన్ రమేష్ బాబు, స్వర్ణ ప్యాలెస్‌ యజమాని శ్రీనివాస్‌ బాబుకోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసు విచారణను కూడా వేగవంతం చేశారు.

Related Posts