YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వింతలు విదేశీయం

జపాన్ లో ట్రాన్స్ పరెన్సీ టాయ్ లెట్లు

జపాన్ లో  ట్రాన్స్ పరెన్సీ టాయ్ లెట్లు

టోక్యో, ఆగస్టు 27
పారదర్శకంగా ఉండే గాజు గోడలతో పబ్లిక్ టాయిలెట్‌లను నిర్మిస్తే.. ఎవరూ అందులోకి వెళ్లడానికి ఇష్టపడరు కదూ. కానీ జపాన్ ఆర్కిటెక్టులు వినూత్నంగా ఆలోచించి పారదర్శకంగా ఉండే టాయిలెట్లను నిర్మించారు.. టోక్యో నగరంలోని పార్కుల్లో ఈ ట్రాన్స్‌పరెంట్ బాత్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఇలా ఉంటే ఎలా..? కాలకృత్యాలు తీర్చుకోవడానికి అందులోకి ఎలా వెళ్తారని అనుకుంటున్నారా..? ఈ టాయిలెట్లను చూడగానే చాలా మంది అలాగే అనుకుంటున్నారు. కానీ వాటి ప్రత్యేకత తెలిసిన తర్వాత మాత్రం వాటి కోసమే ప్రత్యేకంగా పార్కులకు వెళ్తున్నారు.ఈ టాయిలెట్‌ లోపలికి వెళ్లి గడియ పెట్టగానే అప్పటి వరకూ పారదర్శకంగా కనిపించిందంతా.. అపారదర్శకంగా మారిపోతోంది. అంటే లోపలున్న వారు ఏం చేస్తున్నారో బయటికి కనిపించదు. జపాన్ ఆర్కిటెక్ట్ షెయ్‌‌గెరు బన్ ఈ వినూత్న పబ్లిక్ టాయిలెట్‌ను డిజైన్ చేశారు. ది టోక్యో టాయిలెట్ ప్రాజెక్టులో భాగంగా నిపాన్ ఫౌండేషన్ ఈ వినూత్న పారదర్శక బాత్‌రూమ్‌లను ఏర్పాటు చేసింది.స్మార్ట్ గ్లాస్‌తో నిర్మించిన ఈ టాయిలెట్లలోకి ఎవరైనా వెళ్లడానికి ముందే అవి క్లీన్‌గా ఉన్నాయా..? అంతకు ముందే ఎవరైనా అందులో ఉన్నారా అనేది తేలిగ్గా తెలిసిపోతుంది. ఎవరూ లేరని నిర్ధారించుకొని లోపలికి వెళ్లి డోర్ లాక్ చేయగానే టాయిలెట్‌ లోపల ఉన్న వ్యక్తి బయటకు కనిపించకుండా అపారదర్శకంగా మారుతుంది. ఎలాంటి సమయంలోనైనా.. లోపల ఎవరైనా దాక్కొని ఉంటే మహిళలు తేలికగా పట్టేయొచ్చు.టోక్యోలోని యోయోగి ఫుకమచి మినీ పార్క్, హరునో ఒగవా కమ్యూనిటీ పార్కులలో ఈ ట్రాన్స్‌పరెంట్ పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేయగా.. వీటిని చూడటానికే సందర్శకులు భారీగా వస్తున్నారు. రాత్రిపూట ఈ టాయిలెట్లు అద్భుతమైన లాంతరులా మెరిసిపోతున్నాయి. టోక్యోలోని షిబుయాలో ఉన్న 17 పబ్లిక్ టాయిలెట్లను నిపాన్ ఫౌండేషన్ రీడిజైనింగ్ చేస్తోంది.

Related Posts