YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి -  మత్రి ఈటెల రాజేందర్

వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి -  మత్రి ఈటెల రాజేందర్

వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
-  మత్రి ఈటెల రాజేందర్
హైదరాబాద్,
వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో సందర్శనకు వచ్చిన వారికి డెంగ్యు, మలేరియా, చికెన్గున్య ఇతర కీటక జనిత అంటువ్యాధులు తగ్గించటానికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం డెంగ్యు, మలేరియా, చికెన్గున్య ఇతర కీటకజనిత అంటు వ్యాధులు తగ్గాయని తెలిపారు. క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో గంబూసియా చేపల పనితీరు, బయలాజికల్ కంట్రోల్ ద్వారా లార్వాను తినే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎగ్జిబిషన్లో వివిధ రకాల దోమలను పరిశీలించారు. దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి చీఫ్ ఎంటమాలజిస్ట్ డా.రాంబాబును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించిన ప్రతి ఆదివారం 10గంటలకు 10 నిమిషాల కార్యక్రమం పోస్టర్, కరపత్రాన్ని విడుదల చేశారు.   ఈ కార్యక్రమంలో ఎస్.ఇ లచ్చిరెడ్డి, ఎ.ఇ అనీల్, ఎంటమాలజి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts