YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

రెండు రాష్ట్రాల మంత్రుల భేటీ ఏం లేదు

రెండు రాష్ట్రాల మంత్రుల భేటీ ఏం లేదు

హైద్రాబాద్, సెప్టెంబర్ 12 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య బస్సు సర్వీసులు నడిపే అంశంపై ఇద్దరు రవాణా శాఖ మంత్రులు సోమవారం సమావేశమవుతారని వస్తున్న వార్తలపై తెలంగాణ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టత ఇచ్చారు. అంతర్రాష్ర్ట బస్సు సర్వీసుల అంశంపై ఇంత వరకూ స్పష్టత లేదని చెప్పారు. దీనిపై మంత్రుల స్థాయి సమావేశం లేదని మంత్రి  స్పష్టం చేశారు. ఏపీ రవాణా శాఖ మంత్రితో భేటీ కావడంపై ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని వివరించారు. కిలోమీటర్ బేసిస్‌లో అధికారుల ఒప్పందం తర్వాతే  మంత్రుల స్థాయి సమావేశం ఉంటుందన్నారు. అధికారుల స్థాయి సమావేశాలు కొనసాగుతూనే ఉంటాయని మంత్రి పువ్వాడ చెప్పారు.తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ  అజయ్‌కుమార్‌, ఏపీ రవాణా మంత్రి పేర్ని నాని సోమవారం ఈ విషయంలో హైదరాబాద్‌లో సమావేశం అవుతారని శనివారం ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో  మంత్రి పువ్వాడ దీనిపై స్పష్టత ఇచ్చారు. లాక్ డౌన్ విధించినప్పటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల  మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలకు కొత్తగా ఒప్పందం చేసుకోవాలని, ఆ తర్వాతే బస్సులు నడపాలని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. దీంతో బస్సు సర్వీసుల  పునరుద్ధరణపై ప్రతిష్టంభన ఏర్పడింది.అన్ లాక్ మొదలైన తర్వాత అంతర్రాష్ట్ర బస్సుల సర్వీసులు నడుస్తున్నా.. ఏపీ తెలంగాణ మధ్య మాత్రం ఆర్టీసీ బస్సులు మొదలు  కాలేదు. ఇప్పటికే బస్సులు అందుబాటులో లేక.. రైళ్లు కూడా తక్కువగా నడుస్తుండటంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకల విషయంలో సాధారణ ప్రజలు ఇబ్బందులు  పడుతున్నారు.  

Related Posts