YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

దుమ్మరేపిన ఐపీఎల్ వ్యూయర్ షిప్

దుమ్మరేపిన ఐపీఎల్ వ్యూయర్ షిప్

ముంబై, సెప్టెంబర్ 22 
కరోనా వైరస్ దెబ్బకు ఐపీఎల్ ఆరు నెలలు ఆలస్యంగా ఆరంభమైంది. ఓ దశలో ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ కష్టమని భావించారు. కానీ బీసీసీఐ మొండి పట్టుదలతో వేదికను యూఏఈకి తరలించి  లీగ్‌ను నిర్వహిస్తోంది. జట్లన్నీ యూఏఈ వెళ్లిన తర్వాత క్వారంటైన్లో ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన 13 మంది ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడటంతో.. ఐపీఎల్ నిర్వహణకే అనుమాన  మేఘాలు కమ్ముకున్నాయి. కానీ లక్కీగా పెద్దగా ఇబ్బందులేం లేకుండానే మ్యాచ్‌‌లు సాగుతున్నాయి.కోవిడ్ కారణంగా ప్రేక్షకులను అనుమతించకపోవడంతో.. ఖాళీ స్టేడియంలలోనే మ్యాచ్‌లు  జరుగుతున్నాయి. దీంతో క్రికెట్ అభిమానులు టీవీల ద్వారా మ్యాచ్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన తొలి ఐపీఎల్  మ్యాచ్‌కు భారీ ఎత్తు వ్యూయర్‌షిప్ వచ్చింది. బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) లెక్కల ప్రకారం తొలి మ్యాచ్‌ను టీవీలు, ఆన్‌లైన్ ద్వారా వీక్షించారు. ప్రపంచంలో ఏ స్పోర్ట్స్ లీగ్‌కైనా ఈ  స్థాయిలో మొదటి రోజు వ్యూయర్‌షిప్ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.‘బార్క్ ప్రకారం 20 కోట్ల మంది ప్రజలు ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్‌ను వీక్షించారు. ఇప్పటి వరకూ ఏ దేశంలోనైనా.. ఏ స్పోర్ట్స్  లీగ్‌కైనా తొలి రోజు వ్యూయర్‌షిప్ ఈ స్థాయిలో రాలేదు’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ చేశారు.ఇదే విషయాన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్విట్టర్ ద్వారా కూడా వెల్లడించింది. డ్రీమ్ ఎలెవన్
ఐపీఎల్ అద్భుతంగా మొదలైందని.. తొలి మ్యాచ్‌ను 200 మిలియన్ల మంది వీక్షించారని ప్రకటించింది.  

Related Posts