YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

అమెరికా నదిలో మునిగిపోయిన కుటుంబం

అమెరికా నదిలో మునిగిపోయిన కుటుంబం

ఆహ్లాదంగా గడుపుదామని వెళ్లిన ఆ కుటుంబాన్ని నది బలి తీసుకుంది. బంధువుల ఇంటికని బయలుదేరి 10 రోజుల కిందట మిస్సైన ఆ భారతీయులు విగతజీవులుగా కనిపించారు. అమెరికాలోని సాంటా క్లారిటాలో యూనియన్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సందీప్ తొట్టపిల్లి  కుటుంబం అదృశ్యం విషాదాంతమైంది. సందీప్ తన భార్య సౌమ్య  కుమారుడు సిద్ధాంత్ , కుమార్తె సాచితో కలిసి పది రోజుల కిందట సరదాగా గడిపేందుకు బంధువుల ఇంటికి బయలుదేరారు. దురదృష్టవశాత్తూ వారు ప్రయాణిస్తున్న హోండా పైలట్‌ కారు అదుపుతప్పి ఈల్‌ నదిలో పడిపోయిందిసందీప్ కుటుంబం అదృశ్యమైన నాటి నుంచి వారి కోసం సహాయక బృందాలు తీవ్రంగా గాలిస్తూనే ఉన్నాయి. వారం రోజుల కిందట ఈల్ నదిలో సందీప్ కుటుంబసభ్యులకు చెందిన వస్తువులను గుర్తించారు. అనంతరం సౌమ్య మృతదేహాన్ని సహాయక సిబ్బంది వెలికి తీశారు. మరో ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. అనంతరం ఆ మృతదేహాలను సందీప్‌ తోటపిల్లి, ఆయన కుమార్తె సాచివిగా గుర్తించారు. సిద్ధాంత్‌ ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. అతడి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.నదిలో ఓ చోట నుంచి పెట్రోల్‌ వాసన వస్తున్నట్లు గుర్తించిన రెస్య్కూ టీం ఆ ప్రాంతంలో గాలించగా నీటిలో మునిగిపోయి ఉన్న కారు కనిపించిందని పోలీసులు తెలిపారు. నదిలో 4 నుంచి 6 అడుగుల లోతులో కారు పడిపోయి ఉందని వెల్లడించారు. సందీప్‌, సాచి మృతదేహాలు హోండా పైలట్‌ కారులోనే చిక్కుకుని ఉండగా బయటకు తీసినట్లు చెప్పారు.కేరళకు చెందిన సందీప్‌ తల్లిదండ్రులు గుజరాత్‌లో స్థిరపడినట్లు తెలుస్తోంది. గుజరాత్‌లోనే పెరిగిన సందీప్‌ 15 ఏళ్ల కిందట అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. సందీప్‌ కుటుంబం ఓరెగావ్‌లోని పోర్ట్‌ల్యాండ్‌ నుంచి దక్షిణ కాలిఫోర్నియాలోని సాన్‌జోస్‌కు రోడ్డు మార్గంలో కారులో వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. వారి మరణవార్త గుజరాత్‌లోని సందీప్‌ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Related Posts