YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం

కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం

నిజామాబాద్ సెప్టెంబర్ 29 
వ్యవసాయ బిల్లులతో ప్రధాని మోడీ రైతులకు పట్టం కట్టారని ఈ బిల్లు ద్వారా పంటను రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చని అన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. తెలంగాణ లో మార్కెట్ యార్డు ఫీజు 10 వేల కోట్ల ఆదాయం  పోతుందని టిఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని విమర్శించారు. బిల్లులు ఏకపక్షంగా ఆమోదించారని అంటున్న టిఆర్ఎస్  వీఅర్వోల తొలగింపు పై ప్రతిపక్షాలతో చర్చించారా అని ప్రశ్నించారు. కెసిఆర్ రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి సొంత ఖజానాను నింపు కుంటున్నారని ఆరోపించారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయం లో అరవింద్ మీడియా తో మాట్లాడారు. సురేష్ రెడ్డి, మండవ, డి ఎస్ లాంటి నేతలు టిఆర్ఎస్ లో చేరినా కేసీఆర్ తన బిడ్డను గెలిపించు కోలేకపోయారని కార్పోరేటర్లు పొతే ఏమైతదని వ్యాఖ్యానించారు. వేల కోట్లు తిన్న కెసిఆర్ ఆయన కొడుకు కేటీఆర్  జైలుకు పోవడం ఖాయమన్నారు. 2023 లోఏదో రెండు కేసులో తీర్పు కెసిఆర్ కు వ్యతిరేకంగా వస్తుంది. ది వస్తే కెసిఆర్ రాజినామా చేయాల్సిందే అన్నారు.

Related Posts