YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

విష్ణు మంచు చిత్రం 'మోస‌గాళ్లు' టీజ‌ర్ ఆవిష్క‌రించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

విష్ణు మంచు చిత్రం 'మోస‌గాళ్లు' టీజ‌ర్ ఆవిష్క‌రించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శ‌నివారం ఉద‌యం విష్ణు మంచు హీరోగా న‌టిస్తోన్న 'మోస‌గాళ్లు' సినిమా టీజ‌ర్‌ను ఆవిష్క‌రించారు. మోస‌గాళ్లు చేసిన కుంభ‌కోణం ఏ రేంజిలో ఉంటుందో ఈ టీజ‌ర్ తెలియ‌జేస్తోంది. ఇండియాలో మొద‌లై అమెరికాను వ‌ణికించిన 450 మిలియ‌న్ డాల‌ర్ల అతిపెద్ద ఐటీ స్కామ్‌కు పాల్ప‌డినవారిని వైట్ హౌస్‌‌లో ఏర్పాటుచేసిన స‌మావేశంలో మాట్లాడుతూ యు.ఎస్‌. ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ హెచ్చ‌రించ‌డంతో ఈ టీజ‌ర్ మొద‌లైంది. ఆ మీటింగ్‌లో "మిమ్మ‌ల్ని క‌నిపెడ‌తాం. మిమ్మ‌ల్ని నాశ‌నం చేస్తాం. దీనికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి నేను రెడీగా ఉన్నాను, ప్రిపేర్ అయ్యాను" అని ట్రంప్ చెప్పారు. ఆ వెంట‌నే క‌నిపించిన సీన్‌ ఈ ఐటీ స్కామ్ వెనుక ఉన్న మాస్ట‌ర్‌మైండ్స్ విష్ణు మంచు, కాజ‌ల్ అగ‌ర్వాల్ అని మ‌న‌కు ప‌రిచ‌యం చేస్తుంది. నోట్ల క‌ట్ట‌లు కుక్కిన బ్యాగ్‌ల మ‌ధ్య ఆ ఇద్ద‌రూ నిల్చొని క‌నిపించారు. "ఇది స‌రిపోతుంది క‌దా" అని కాజ‌ల్ అంటే, "ఆట ఇప్పుడే మొద‌ల‌య్యింది" అని చెప్తున్నారు విష్ణు. శ్యామ్ సి.ఎస్‌. ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌.. టీజ‌ర్‌లోని విజువ‌ల్స్‌ను మ‌రింత‌గా ఎలివేట్ చేస్తోంది.
'మోస‌గాళ్లు' చేసిన అతిపెద్ద భారీ స్కామ్ ఏ రేంజిలో ఉంటుందో ఈ టీజ‌ర్ చూపించ‌డం, దానిపై ఏకంగా అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చ‌రిస్తూ మాట్లాడ‌టంతో, సినిమాపై ఆస‌క్తి బాగా పెరిగి, ఆ స్కామ్ వెనుక క‌థేమిటో తెలుసుకోవాల‌నే కుతూహ‌లం క‌లుగుతోంది. ఈ టీజ‌ర్‌తో సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ మ‌రింత‌ పెరిగాయి. 'మోస‌గాళ్లు' చిత్రం తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల కానున్న‌ది.
 

Related Posts