YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు విదేశీయం

అఫ్గానిస్థాన్ ఓపెనింగ్ బ్యాట్స్మన్ నజీబ్ కన్ను మూత

అఫ్గానిస్థాన్ ఓపెనింగ్ బ్యాట్స్మన్ నజీబ్ కన్ను మూత

న్యూ డిల్లీ అక్టోబర్ 6 
అఫ్గానిస్థాన్ ఓపెనింగ్ బ్యాట్స్మన్ నజీబ్ రోడ్డు ప్రమాదంలోగాయపడి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. 29 ఏళ్ల నజీబుల్లా తరకాయ్ గత శుక్రవారం జలలాబాద్ లో  మార్కెట్ కు వెళ్లాడు. ఆ మార్కెట్ లో సరుకులు కొనుక్కుని రోడ్డు దాటుతున్న సమయంలో ఓ ప్యాసింజర్ కారు దూసుకొచ్చి నజీబ్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో నజీబ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. నంగర్హర్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు  ప్రాణాలు విడిచాడు నజీబ్. నజీబ్ మరణించాడన్న వార్తను అఫ్గన్ క్రికెట్ బోర్డు జీర్ణించులేకపోతున్నది. డ్యాషింగ్ ఓపెనర్తో పాటు ఓ మంచి మనిషిని కోల్పోయామని బాధను వ్యక్తం చేస్తూ  అఫ్గన్ క్రికెట్ బోర్డు మరణ వార్తను ధ్రువీకరించింది. 2014లో జింబాబ్వేపై బంగ్లాదేశ్ లో తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన నజీబ్ ఆ తర్వాత అఫ్గన్ టీమ్ లో కీలక ఆటగాడిగా మారాడు. తన క్రికెట్ కెరియర్ లో  మొత్తం 24 మ్యాచుల లో 47.20 సగటుతో 2030 పరుగులు చేశాడు.. అయిదు సెంచరీలతో పాటు ఓ డబుల్ సెంచరీ కూడా చేశాడు.. ఐర్లాండ్ తో జరిగిన ఓ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన నజీబ్ అందు లో అయిదు పరుగులు చేశాడు. ఇక 12 టీ-20 మ్యాచుల్లో 258 పరుగులు చేశాడు. 2017 లో ఐర్లాండ్ తోనే జరిగిన ఓ టీ -20 మ్యాచ్ లో మెరుపు వేగంతో 90 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

Related Posts