YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వింతలు దేశీయం

అర్ధనారీశ్వర రూపంలో వింత పక్షి..

అర్ధనారీశ్వర రూపంలో వింత పక్షి..

న్యూ ఢిల్లీ అక్టోబర్ 9  
మన పురాణాల్లో పరమ శివుడు ఒక పక్క పురుషుడిగా, మరోపక్క స్త్రీగా నీరాజనాలు అందుకోవడం మనకుతెలుసు. కానీ ఇలాంటి రూపాన్ని పక్షుల్లోనూ ఉంటుందని చెబుతున్నారు అమెరికా పరిశోధకులు. పౌడర్ మిల్ నేచర్ రిజర్వ్ సెంటర్‌లో ఉభయలింగజీవిని పరిశోధకులు కనుగొన్నారు. సెప్టెంబర్ 24న ఓ ఉభయలింగజీవి పరిశోధకురాలి కంటపడగా.. ఆమె తన టీమ్‌కు కబురందించింది. వెంటనే వారు అక్కడికి చేరుకుని ఆ పక్షిని జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్నారు. వక్షస్థలంలో గులాబీ రంగుతో ఉన్న ఈ పికిలిపిట్ట(గిజిగాడు) పరిశోధకులను అబ్బురపరుస్తోంది. దీని శాస్త్రీయ నామం ఫియోటికస్ లూడోవిసియానస్ కుడివైపున పురుష రూపం, ఎడమవైపున స్త్రీ రూపం ఉండటంతో అరుదైన పక్షి జాతి అంటూ పరిశోధనలు మొదలుపెట్టేశారు

Related Posts