YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

క‌విత‌కు మంత్రి ప‌ద‌వి..?

క‌విత‌కు మంత్రి ప‌ద‌వి..?

క‌విత‌కు మంత్రి ప‌ద‌వి..?
హైద్రాబాద్, 
ర‌స‌వ‌త్త‌రంగా న‌డిచిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ మ‌హిళా నేత క‌విత విజయం సాధించారు. స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్ లో క‌విత ఓడిన చోటు నుంచే మ‌ళ్లీ గెల‌వ‌డం ఇంట్ర‌స్టింగ్ గా మారింది అదే ఏరియా కావ‌డంతో టీఆర్ఎస్ కూడా సీరియ‌స్ గా తీసుకుంది. ఓటు హ‌క్కు ఉన్న స్థానిక సంస్థ‌ల నేత‌ల‌ను ముందు నుంచే అప్రోచ్ అయింది. ఎమ్మెల్యేలంతా ఓటు బ్యాంకును కూడ‌గ‌ట్టే పనిలో బిజీ అయిపోయారు. ఎన్నిక‌కి ముందే వారిని క్యాంపుకి త‌ర‌లించి.. నేరుగా పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లారు. అప్పుడే క‌విత విజ‌యం ఫిక్స్ ఐదు రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లానని కల్వకుంట్ల కవిత ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవలే ఆమె టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎలెక్షన్ కౌంటింగ్ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను ఆమె కలిశారు. ఆయనకు కరోనా నిర్ధారణ అవ్వడంతో ఆమె క్వారెంటైన్ లోకి వెళ్లారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని  ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. గత ఐదు రోజులుగా తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ హోమ్ ఐసొలేషన్ కు వెళ్లాలని, కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు. దీనిపై కవిత స్పందించారు 'అన్నా మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. నేను మిమ్మల్ని కలిసిన నేపథ్యంలో హోం క్వారంటైన్ కు వెళ్తున్నా. ముందు జాగ్రత్త చర్యగా ఐదు రోజుల పాటు క్వారంటైన్ లో ఉంటా. కొన్ని రోజుల పాటు పార్టీ శ్రేణులు ఎవరూ నా కార్యాలయానికి రావద్దని కోరుతున్నా' అని కవిత ట్వీట్ చేశారు.వైద్యం పేరుతో ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డ దొంగబాబాకు నిజామాబాద్ లో బడితె పూజలు చేశారు. దొంగబాబాపై బాధితురాలి తల్లిదండ్రులు, స్థానికులు దాడి చేసి, దేహశుద్ధి చేశారు.ఈ ఘటనపై కల్వకుంట్ల కవిత సీరియస్ అయ్యారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కర్కోటకుడికి బుద్ధి వచ్చేలా చేయాలని.. దొంగబాబాను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. మరోవైపు కవిత ఆదేశాలతో బాధితురాలిని నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్, జడ్పీటీసీ సుమనా రెడ్డి పరామర్శించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. .క‌విత విజ‌యం త‌ర్వాత ఇప్పుడు మంత్రి ప‌ద‌వి ఖాయం అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడే కాదు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల విష‌యం గురించి వార్త‌ల టైమ్ నుంచే క‌విత విజ‌యం ఖాయం.. త‌ర్వాత మంత్రి ప‌ద‌వి కూడా ఖాయం అంటూ పార్టీల్లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇక విక్ట‌రీ కూడా వ‌చ్చేయ‌డంతో ఏ ప‌ద‌వి ఇస్తారు.. ఎవ‌రికి చెక్ పెడ‌తారు. లేదంటే శాఖ‌లు స‌ర్దుతారా.. అస‌లా ఛాన్స్ ఉందా లేదా అనే విష‌యంపై చ‌ర్చ న‌డుస్తోంది. ఏదో ఒక‌టి కానీ.. మంత్రి ప‌ద‌వి అయితే క‌చ్చితంగా ఇస్తారు అనే విష‌యంపై ఫుల్ క్లారిటీగా ఉన్నారు లీడ‌ర్లు.  

Related Posts

0 comments on "క‌విత‌కు మంత్రి ప‌ద‌వి..?"

Leave A Comment