YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

 వైసీపీ...కిం క‌ర్త‌వ్యం న్యూఢిల్లీ,

 వైసీపీ...కిం క‌ర్త‌వ్యం న్యూఢిల్లీ,

 వైసీపీ...కిం క‌ర్త‌వ్యం
న్యూఢిల్లీ,
 ఏపీ బీజేపీ నేతలు మాకూ వైసీపీతో పొత్తు ఏంటి. వారి సిద్ధాంతాలు వేరు, మావి వేరు, అసలు కలిసేది లేదు అంటున్నారు. పైగా తమకు టీడీపీతో పాటు వైసీపీ కూడా రాజకీయ ప్రత్యర్ధి అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. కానీ కేంద్ర పెద్దల ఆరాటం మాత్రం ఒక రేంజిలో ఉంది. లేకపోతే కరోనా బారిన పడి ఇంటికి వచ్చిన వెంటనే అర్జంటుగా అమిత్ షా జగన్ ని తన వద్దకు రప్పించుకుని రెండు మార్లు భేటీలు వేయాల్సిన అవసరం అయితే లేదు, ఇక మోడీ ఏ సీఎం కి కరోనా తరువాత అప్పాయింట్మెంట్లు ఇవ్వలేదు. కానీ జగన్ కి ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ మంతనాలు సాగించడాన్ని కూడా కూడా అర్ధం చేసుకుంటే రాజకీయంగా కధలు ఎన్నో కనిపిస్తాయి వినిపిస్తాయి.ఇక ఏపీకి సంబంధించినంతవరకూ జగన్ కి ఎన్డీయే ఆహ్వానం ఒక వరంగానే చూడాలి. ఆర్ధికంగా ఏపీ బాగుపడుతుంది. అప్పులు తగ్గుతాయి. రాజకీయ కష్టాలే కాదు అన్ని రకాల ఇబ్బందుల నుంచి జగన్ ఇట్టే బయటపడగలరు. కానీ రాజకీయంగా జగన్ కి ఎంత వరకూ లాభం అన్నదే వైసీపీలో సాగుతున్న చర్చ అట. మోడీ వంటి పెద్ద మనిషి పిలిచి పదవులు ఇస్తామంటే వదులుకోవడం మంచిది కాదని వైసీపీలో ఒక చర్చగా ఉందట. పైగా ఏపీని అభివృధ్ధి చేసుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం వేరే ఉండదని కూడా అంటున్నారట. వైసీపీకి చెందిన కేంద్ర మంత్రులు చేతిలో ఉంటే ఏపీలో చాలా పెద్ద ఎత్తున ప్రగతి పనులు సాగుతాయని చెబుతున్నారుట.అయితే జగన్ మాత్రం ప్రత్యేక హోదా కానీ తత్సమానమైన ప్యాకేజీ కానీ కేంద్రం నుంచి రాకుండా ఊరకే చేరిపోతే వైసీపీ రాజకీయ పునాదులే దెబ్బతింటాయని ఆందోళన పడుతున్నట్లుగా టాక్. ఆ ఒక్కటి తప్ప అన్నట్లుగా బీజేపీ హోదా విషయాన్ని దాటవేస్తోందని అంటున్నారు. అవసరం అయితే నిధులు దండీగా ఇస్తాం కానీ హోదా ఊసు ఎత్తకండి అంటున్నారని టాక్. మరి హోదా తెస్తామని చెప్పిన జగన్ మాట తప్పితే ఎలా అన్నది కూడా ఒక చర్చగా ఉందిట. జగన్ అందుకే ఈ విషయంలో చాలా తీవ్రంగా ఆలోచన చేస్తున్నారుట.జగన్ బయట నుంచి ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నారు. అది ఏ పార్టీ ఇవ్వనంత నమ్మకాన్ని కూడా కలిగించేలా ఉంటోంది. కానీ ప్రధాని మోడీకి కానీ, కేంద్ర పెద్దలకు కానీ వైసీపీ తమ మిత్ర పక్షం అని అధికారికంగా అనిపించుకోవాలని ఉందిట. దానికి కారణాలు అనేకం ఉన్నాయని అంటున్నారు. ఎన్డీయే నుంచి అనేక పార్టీలు వెళ్ళిపోతున్నాయి. దాంతో బలమైన వైసీపీని తెచ్చుకుంటే జాతీయ స్థాయిలో పొలిటికల్ గ్రాఫ్ పెరుగుతుందన్నది కాషాయం పెద్దల ఆలోచన. దానికి జగన్ నో చెబుతూండడంతో మధ్యేమార్గంగా లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని వైసీపీకి మోడీ ఆఫర్ చేశారని కొత్త వార్త వినిపిస్తోంది. ఆ విధంగానైనా తమతో వైసీపీ ఉన్నట్లుగా చెప్పాలని కోరుతున్నారుట. మొత్తం మీద జగన్ ని వైసీపీని బీజేపీ పెద్దలు వదిలేట్టులేరని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Related Posts