YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జూరాలలో జలకళ

జూరాలలో జలకళ

జూరాలలో జలకళ
మహబూబ్ నగర్ 
మహబూబ్ నగర్ జిల్లా లోని జూరాల ప్రాజెక్టు కు జలకళ సంతరించుకుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టు కు భారీ వరద నీరు చేరుతుండడంతో ప్రాజెక్ట్ 42 గేట్ల ద్వారా 3.69.690  వేల క్యూసెక్కుల నీటిని దిగువకు శ్రీశైలం వైపు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3.86.000 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది. భారీ వరద వస్తుండడంతో జూరాల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.  జూరాల జలాశయం పూర్తి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 318.10 మీటర్లుగా ఉంది. జలాశయం పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 8.631 టీఎంసీలుగా ఉంది.

Related Posts