YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నిరాడంబరంగా మైసూరు దసరా వేడుకలు

నిరాడంబరంగా మైసూరు దసరా వేడుకలు

మైసూరు అక్టోబర్ 17 
మామూలుగా అయితే మైసూరు దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యేవి.. కానీ కరోనా వైరస్ రాకతో ఆ వేడుకలు నిరాడంబరంగానే మొదలయ్యాయి.. దసరా వేడుకలనగానే అప్రయత్నంగానే గుర్తుకొచ్చేది మైసూరు.. పది రోజుల పాటు అక్కడ వైభవంగా జరుగుతాయి.. కర్నాటక సంస్కృతీ సంప్రదాయలకు చిహ్నంగా నిలుస్తాయి.. ముఖ్యమంత్రి యడియూరప్ప మైసూరు రాజకుటుంబీకులతో కలిసి చాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈసారి ఆ వేడుకలను ప్రత్యక్షంగా చూసే అదృష్టం ప్రజలకు లేదు.. ఉత్సవాలను లైవ్ టెలికాస్టులో చూడవచ్చు.. నవరాత్రులలో రాజప్రసాదం, చాముండేశ్వరి ఆలయం కొత్త కాంతులను అద్దుకుంటాయి.. విద్యుత్దీపాల వెలుగులో మెరిసిపోతుంటాయి.. మైసూరులో దసరా ఉత్సవాలను నిర్వహించడమన్నది 15వ శతాబ్దంలోనే మొదలయ్యింది.. విజయనగర పాలకులు కూడా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.. విజయనగర సామ్రాజ్యం పతనం అయ్యాక మైసూరు రాజులైన ఒడయార్లు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.

Related Posts