YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

నవంబర్ 5 నుంచి ఎఫ్ 3 స్టార్ట్

నవంబర్ 5 నుంచి ఎఫ్ 3 స్టార్ట్

హైద్రాబాద్, అక్టోబ‌రు 23, 
విక్టరీ వెంకటేష్‌ లుక్ మారుస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కరోనా వచ్చినప్పటి నుంచి ఇంటికే పరిమితమైన వెంకీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఇటీవల మంచు విష్ణు నటించిన మోసగాళ్లు మూవీకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి బయటకు వచ్చారు. కరోనా తర్వాత వెంకీ బయటకు రావడం అంటే అదే. ఇప్పుడు స్టార్ హీరోలు, సీనియర్ హీరోలు కూడా షూటింగ్ లు స్టార్ట్ చేయడంతో వెంకీ కూడా షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. వెంకీ నటిస్తున్న కొత్త సినిమా నారప్ప. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు.తమిళంలో రూపొందిన అసురన్ చిత్రానికి రీమేక్ గా వస్తున్న చిత్రమిది. లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రం షూటింగ్ అవుట్ డోర్ లో చాలా భాగం జరిగింది. అనంతరం లాక్ డౌన్ తో ఆరు నెలలు బ్రేక్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ షూటింగుకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. నారప్ప షూటింగ్ ని పక్కనపెట్టి ఎఫ్ 3 షూటింగ్ స్టార్ట్ చేస్తారనుకున్నారు కానీ.. నారప్ప షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని తెలిసింది. ఇది కంప్లీట్ చేసిన తర్వాతే ఎఫ్ 3 స్టార్ట్ చేయనున్నారు. నవంబర్ 5 నుంచి షూటింగ్ ప్రారంభించడానికి వెంకీ రెడీ అవుతున్నారని తెలిసింది. అయితే... ఆయన ఇప్పుడు ఐదు రోజుల పాటే షూటింగులో పాల్గొంటారని తెలిసింది.ప్రస్తుతం గడ్డం పెంచివున్న వెంకీ ఆ గెటప్పుకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణలో ఐదు రోజుల పాటు పాల్గొంటారు. ఆతర్వాత డిసెంబర్ నుంచి లుక్ మారుస్తారు. గడ్డం లేని సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం.

Related Posts