YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

సోలో బ్రతుకే సో బెటర్'. క్లీన్ యూ సర్టిఫికెట్

సోలో బ్రతుకే సో బెటర్'. క్లీన్ యూ సర్టిఫికెట్

హైద్రాబాద్, అక్టోబ‌రు 23, 
ఒక్క కట్ కూడా చెప్పకుండా సోలో బ్రతుకే సో బెటర్ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారట.  మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సోలో బ్రతుకే సో బెటర్'. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుబ్బు తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ కి వెళ్ళింది. సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ఎటువంటి కట్స్ చెప్పకుండా క్లీన్ 'యూ' సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం.త్వరలోనే  సోలో బ్రతుకే సో బెటర్ మూవీ గ్రాండ్ గా విడుదల కానుంది. కాగా టైటిల్ కి తగ్గట్టే పెళ్లి అంటే ఇష్టంలేని.. సోలోగా ఉండటమే బెటర్ అని అనుకునే యువకుడి కథ  ఈ చిత్రం  అని తెలుస్తోంది. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కి జోడీగా నభా నటేష్ నటించింది. ఇప్పటికే 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు 'నో పెళ్లి' వీడియో సాంగ్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదే క్రమంలో సిద్ శ్రీరామ్ ఆలపించిన 'హే ఇది నేనేనా..' సాంగ్ మరియు 'అమృత' అనే బ్రేకప్ సాంగ్ కూడా సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చారు.వెంకట్ సి దిలీప్ కెమెరామెన్ గా వ్యవహరించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు. 'చిత్రలహరి' 'ప్రతీరోజూ పండగే' వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాల తర్వాత సాయి ధరమ్ తేజ్ నుంచి వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ మూవీతో మెగా మేనల్లుడు తన విజయాల పరంపర కొనసాగిస్తాడేమో చూడాలి. కాగా మెగా డాటర్..నటి నిహారిక పెళ్ళి తర్వాత సాయి ధరమ్ తేజ్ పెళ్ళి పీటలు ఎక్కనున్నట్టు టాక్. ఆ పెళ్ళి బాద్యత మెగాస్టార్ చిరంజీవిదేనని వార్తలు కూడా వచ్చాయి.

Related Posts