YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

సంజయ్ కు ఉరిశిక్ష 9 మంది హత్య కేసులో నిందితుడికి కోర్టు శిక్ష ఖరారు

సంజయ్ కు ఉరిశిక్ష  9 మంది హత్య కేసులో నిందితుడికి కోర్టు శిక్ష ఖరారు

వరంగల్, అక్టోబరు 28
తెలంగాణలో సంచలనం వరంగల్ బావిలో తొమ్మిది మంది హత్య కేసులో నిందితుడికి కోర్టు శిక్ష ఖరారు చేసింది. సంచలనం సృష్టించిన గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసులో నిందుతుడు సంజయ్ కుమార్ యాదవ్ కు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది ఈ ఏడాది మే 20న వరంగల్‌ నగర శివారులోని గొర్రెకుంట బావిలో 9మందిని హత్య చేసిన కేసులో విచారణ పూర్తయింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నిందితుడిపై అభియోగాలను నిరూపించారు.సంజయ్ కుమార్ కి ఉరి శిక్ష పడాలనీ అదే సరైన శిక్ష అంటూ న్యాయమూర్తి ముందు బలంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణ తన వాదనలు బలంగా వినిపించారు. న్యాయమూర్తి ముందు హత్యలు చేసినట్టు నిందితుడు సంజయ్ కుమార్ నేరం అంగీకరించాడు. దీంతో నేరం రుజువైనట్లు వరంగల్‌ మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. నిందితుడిపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటన జరిగిన నెల రోజుల్లోనే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయడం గమనార్హం. 25 రోజుల్లోనే చార్జీషీట్ దాఖలు చేశారు పోలీసులు. ఈ కేసులో దాదాపు 98 మందిని న్యాయమూర్తి విచారించారు. వారిలో 68 మందిని సాక్షులుగా పరిగణలోకి న్యాయమూర్తి జయకుమార్ తీసుకున్నారు.
అసలేం జరిగింది ?
పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన ఎండీ మక్సూద్‌ 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం వరంగల్‌కు కుటుంబంతో సహా వలస వచ్చాడు. కరోనా లాక్ డౌప్ కారణంగా డిసెంబరు నెల నుంచి గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని ఓ గన్నీ సంచుల తయారీ గోదాంలో పని చేస్తున్నారు. అక్కడే గోదాం పక్కనే ఉన్న రెండు గదుల్లో మక్సూద్‌తో పాటు, ఆయన భార్య, ఇద్దరు కుమారులు ఉంటున్నారు. వీరితో మక్సూద్ భార్య అక్క కూతురు రఫికా కూడా నివాసం ఉంటుంది. ఈ కుటుంబంతో పరిచయం పెంచుకున్న సంజయ్ కుమార్ రఫికాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.ఒక నేరాన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో నిందితుడు సంజయ్ కుమార్ ఈ తొమ్మిది హత్యలకు పాల్పడ్డాడు. మక్సూద్ కుటుంబంలో రఫికాతో సంజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతోపాటు గదిలోనే ఉండేేవాడు. ఆ తర్వాత ఆమె కూతురితో కూడా చనువుగా ఉండటం మొదలు పెట్టాడు. ఇది చూసిన రఫికా అతడ్ని నిలదీసింది. దీంతో పెళ్లి విషయమై పెద్దలతో మాట్లాడుదాం పద అంటూ ఆమెను రైలెక్కించి... మధ్యదారిలోనే హత్య చేసి రైలు నుంచి బయటకు తోశాడు. రఫికా కనిపించకపోయే సరికి మక్సూద్ భార్య సంజయ్‌ను నిలదీసింది. దీంతో కంగారు పండిన సంజయ్ ఎక్కడ తాను హత్య చేసిన విషయం బయకు వస్తుందోనని కుటుంబం మొత్తం చంపేందుకు ప్లాన్ వేశాడు. మే 16 నుంచి 20వ తేదీ వరకు రోజూ వారు పనిచేసే గోనె సంచుల తయారీ కేంద్రాన్ని సందర్శించేవాడు. చుట్టు పక్కల ప్రదేశాలను పరిశీలించాడు. మే 20వ తేదీన మక్సూద్‌ మొదటి కుమారుడైన షాబాజ్‌ పుట్టిన రోజు అని తెలుసుకుని ఆ రోజే చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం 18వ తేదీన వరంగల్‌ చౌరస్తాలో ఓ మెడికల్‌ షాపులో సుమారు 60 నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. 20వ తేదీ రాత్రి వారితో ముచ్చటించాడు. అనుకూలంగా ఉన్న సమయంలో మక్సూద్‌ కుటుంబం తయారు చేసుకున్న భోజనంలో నిద్రమాత్రలు కలిపాడు. తాను ఇక్కడికి వచ్చిన విషయాన్ని బయటకు చెబుతారన్న ఉద్దేశంతో ఈ కుటుంబానికి సంబంధం లేని శ్యాం, శ్రీరాం తయారు చేసుకున్న భోజనంలోనూ నిద్రమాత్రలు కలిపాడు. వారంతా నిద్రలోకి జారుకున్నాక అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య వరకు మత్తులో ఉన్న ఎండీ మక్సూద్‌(50), ఆయన భార్య నిషా(45), కుమార్తె బుస్ర (20), బుస్ర కుమారుడు(3), షాబాద్‌(22), సోహైల్‌(20), బిహార్‌కు చెందిన కార్మికులు శ్యామ్‌(22), శ్రీరామ్(20), వరంగల్‌ వాసి షకీల్ ను గోదాము పక్కనే ఉన్న బావిలో పడేసి ఇంటికెళ్లి పోయాడు.

Related Posts

0 comments on "సంజయ్ కు ఉరిశిక్ష 9 మంది హత్య కేసులో నిందితుడికి కోర్టు శిక్ష ఖరారు"

Leave A Comment