YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం దేశీయం విదేశీయం

భారత్ కు అమెరికా అండ

భారత్ కు అమెరికా అండ

న్యూఢిల్లీ, అక్టోబరు 28 
సార్వ‌భౌమ‌త్వాన్ని కాపాడుకునేందుకు భార‌త్ చేప‌ట్టే చ‌ర్య‌ల‌కు అమెరికా అండ‌గా నిలుస్తుంద‌ని అగ్ర‌దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే.  ఇండియా టూర్‌లో ఉన్న ఆయ‌న మంగ‌ళ‌వారం ఈ వ్యాఖ్య‌లు చేశారు.  అయితే ఆ కామెంట్ల‌పై ఇవాళ డ్రాగ‌న్ దేశం చైనా స్పందించింది.  స‌రిహ‌ద్దు వివాదం ద్వైపాక్షిక అంశ‌మ‌ని, ఈ విష‌యంలో వాస్త‌వాల‌ను, నిజాల‌ను అమెరికా గ్ర‌హించాల‌ని చైనా పేర్కొన్న‌ది. చైనా ఎంబ‌సీ ఓ ప్ర‌క‌ట‌న‌లో స్పందిస్తూ.. ద్వైపాక్షిక సంబంధాలు, న్యాయ‌ప‌ర‌మైన హ‌క్కులపై మూడ‌వ పార్టీ జోక్యం అవ‌స‌రం లేద‌ని చైనా వెల్ల‌డించింది.   భార‌త్‌, చైనా మ‌ధ్య స‌రిహ‌ద్దు స‌మ‌స్య ద్వైపాక్షిక అంశ‌మ‌ని, రెండు దేశాలు ఈ అంశంపై చ‌ర్చిస్తున్నాయ‌ని, సైనిక‌ప‌రంగా, దౌత్య‌ప‌రంగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని, విభేదాల‌ను ప‌రిష్క‌రించే సామ‌ర్థ్యం రెండు దేశాల‌కు ఉన్న‌ట్లు చైనా త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఈ అంశంలో జోక్యం చేసుకునే అవ‌కాశం మూడ‌వ పార్టీకి లేద‌ని చైనా చెప్పింది. చైనాతో ప్ర‌మాదం ఉంద‌న్న వాద‌న‌ల‌ను ఆపేసి.. మెద‌డు నుంచి ప్ర‌చ్చ‌న్న‌యుద్ధ ఆలోచ‌న‌ల్ని తీసివేయాల‌ని కోరింది.  వాస్త‌వాల‌ను గౌర‌వించి, స్థానిక సామ‌ర‌స్య‌త‌కు స‌హ‌క‌రించాల‌ని అమెరికాను చైనా కోరింది.

Related Posts