
న్యూఢిల్లీ
ఛార్ధామ్ యాత్ర నిలిపివేసారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. యాత్రికుల క్షేమం దృష్ట్యా ఛార్ ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పాక్ దాడులు చేసే అవకాశం ఉండడంతో గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపింది. ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 30న ప్రారంభమైంది. బద్రినాత్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. హెలికాప్టర్ సేవలను కుడా నిలిపివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. యాత్ర ఎప్పటి వరకు రద్దు, తిరిగి ఎప్పుడు ప్రారంభించే విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది.