
హైదరాబాద్
బనకచర్లపై చర్చలను ఇప్పుడు బీఆర్ఎస్ తప్పుబడుతోంది. బీఆర్ఎస్ హయాంలో జగన్తో చర్చలు జరపలేదా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గోదావరి జలాలకు మళ్లిస్తామని చెప్పలేదా . కేసీఆర్ అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారు. రెండు రాష్ట్రాలు మాట్లాడుకుని పరిష్కారం చేసుకోవాలి. నీటి వివాదాలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులుపడాలి. రేవంత్ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. కేసీఆర్కు కిషన్రెడ్డి సహకరిస్తున్నారనడం సరికాదు. తెలంగాణ హక్కులను కాపాడటంలో బీజేపీ, కేంద్రం వెనకడుగు వేయదని అన్నారు. ఒకరాష్ట్రానికి అన్యాయం..మరో రాష్ట్రానికి మేలు చేయం. రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలని కోరుకుంటామని అన్నారు.