
హైదరాబాద్
ఆర్డినెన్స్‌కి గవర్నర్ ఆమోదం తెలుపుతారా
తెలంగాణ హైకోర్టు గడువులోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీంతో ఎన్నికలకు అంతా సిద్ధం చేస్తోంది. ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదం కోసం పంపింది. ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్ ఆమోదిస్తే చట్టసవరణ అమల్లోకి రానుంది. దీనికి అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్.. స్థానిక సంస్థలకు రిజర్వేషన్లను సిఫార్సు చేయనుంది. వాటి ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపనుంది. అయితే గవర్నర్ ఆమోదిస్తారా లేదా, అనేది ఉత్కంఠగా మారింది.