YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

లవ్ జిహాదీకి వ్యతిరేకంగా చట్టం

లవ్ జిహాదీకి వ్యతిరేకంగా చట్టం

లవ్ జిహాదీకి వ్యతిరేకంగా చట్టం
ఛండీఘడ్, నవంబర్ 2,
లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకురానున్నట్టు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, హరియాణా కూడా అదే బాటలో పయనిస్తున్నట్టు ప్రకటించింది. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా కొత్తగా చట్టం తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా యూపీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో హర్యానా హోం ఈ వ్యాఖ్యలు చేశారు.‘హర్యానా రాష్ట్రంలో లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకువచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నాను’ అని అనిల్ విజ్ ట్వీట్ చేశారు.హరియాణాలో వల్లబ్‌నగర్‌లో నిఖితి (21) అనే కాలేజీ విద్యార్థిని హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇస్లాం స్వీకరించి ముస్లింను వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో హత్య చేసినట్టు మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. హరియాణాలో జరిగిన హత్యలో లవ్ జిహాద్ కోణాన్ని పరిశీలించడానికి తాము ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి ప్రకటించారు. ‘హరియాణాలో ఎవరూ పోకిరీల్లా ప్రవర్తించడానికి నేను అనుమతించను, మా కుమార్తెలు, సోదరీమణులను బూతులు తిడితే తీవ్రంగా పరిగణిస్తాను’ అని మంత్రి హెచ్చరించారు.జనౌపూర్, డియోర్ ఉప-ఎన్నికల ప్రచారంలో ఆదిత్య నాథ్ శనివారం మాట్లాడుతూ.. లవ్ జిహాద్‌ వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకొస్తామని పేర్కొన్న యూపీ సీఎం.. తమ కుమార్తెలు, సోదరీమణులను గౌరవించని వారికి హిందూ అంత్యక్రియల శ్లోకం ‘రామ్ నామ్ సత్య హై’‌ చెబుతామని అన్నారు. హిందూ బాలికలను ప్రేమ పేరుతో వలవేసి బలవంతపు మత మార్పిడికి పాల్పడుతున్నారని.. దీనిని కప్పిపుచ్చుకోడానికి హక్కుల కార్యకర్తలు లవ్ జిహాద్ పోస్టర్లు వేస్తారని యోగి దుయ్యబట్టారు.

Related Posts