YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు తెలంగాణ

మహిళా ఉద్యోగినులపై అసభ్య ప్రవర్తన... అరెస్ట్

మహిళా ఉద్యోగినులపై అసభ్య ప్రవర్తన... అరెస్ట్

హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఓ ప్రైవేటు ఉద్యోగి రెచ్చిపోయాడు. తోటి సహోద్యోగినులను లైంగికంగా వేధిస్తుండడం వెలుగు చూసింది. ఒంటరిగా కనిపించిన మహిళా ఉద్యోగినులపై అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో అతనిని పోలీసులు అరెస్టు చేశారు. వారు పని చేసే వాణిజ్య భవనం సెల్లార్‌లో ఉద్యోగినులు ఇళ్లకు వెళ్లేటప్పుడు వాహనం కోసం వచ్చినప్పుడు నిందితుడు అసభ్యంగా ప్రవర్తించేవాడని బాధిరాలు తన ఫిర్యాదులో పేర్కొంది. వివరాలివీ.. హైదరాబాద్‌లోని నిజాంపేట్‌లో ఓ ప్రముఖ సూపర్ మార్కెట్‌లో పని చేసే టీం లీడర్ తన ఉద్యోగినులను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఒంటరిగా దొరికిన ఓ ఉద్యోగినిని వేధింపులకు గురిచేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు నిజాంపేట్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో ఒక మహిళా సేల్స్ గర్ల్‌గా పని చేస్తుంది. నిందితుడు నారాయణ కూడా అదే సూపర్ మార్కెట్‌లో టీం లీడర్‌గా పని చేస్తున్నాడు. ప్రతిరోజు సేల్స్ గర్ల్స్‌ను వేధింపులకు గురి చేస్తుండేవాడు. షాపులోని సెల్లార్‌లో ఎవరూ లేని సమయంలో అరాచకాలకు పాల్పడేవాడు.ప్రతిరోజు అతని వేధింపులు భరించలేక ఆ మహిళ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే సూపర్ మార్కెడ్ టీం లీడర్ నారాయణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Related Posts