
హైదరాబాద్, జూలై 25,
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో వచ్చిన హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కి పెద్దగా బజ్ అయితే లేకుండా పోయింది. దాంతో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి ప్రమోషన్స్ చేయడంతో ఈ సినిమా మీద హైప్ ఒక్కసారిగా పెరిగింది. దాంతో టికెట్స్ మొత్తం బుక్ అయ్యాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ ని సాధించిందా? లేదా అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే మొగలులా సామ్రాజ్యధినేత అయిన ఔరంగ జేబు నిజమైన హిందువులు వాళ్ల మతాన్ని కాపాడుకుంటూ హిందువుగా బతకడానికి ‘జిజియా’ పన్ను కట్టాల్సిందే అనే ఒక రూల్ పెడతాడు. మరి హిందుత్వాన్ని హిందువులను కాపాడుకోవడానికి వీరమల్లు ఏం చేశాడు. ఆయన రాబిన్ హుడ్ లా మారి జనాలను బతికిస్తూ మొగల్స్ పైన ధర్మ యుద్ధం ఎలా చేశాడు అనేది ఈ సినిమా స్టోరీ…ఒక రకంగా ఈ సినిమా లో కొంతవరకు ఫిక్షన్ స్టోరీ ని ఆడ్ చేసినప్పటికి మొగులుల గురించి ఇంతకుముందు మనం విన్నది అంతా అబద్ధం అనేది చూపించారు. ఎంతసేపు మొగలులు మంచి వాళ్ళు అంటూ చరిత్రలో రాసి పెట్టారు. కానీ వాళ్ళ అరాచకాలు, ఆకృత్యాలు ఎలా చేశారు, ఎవరు చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ నిజమైన చరిత్రను ఇప్పుడు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే ‘హరిహర వీరమల్లు’ సినిమా కూడా అలాంటి సినిమానే కావడం విశేషం… మరి హీరో ఔరంగజేబు మీద ఎలా యుద్ధం చేశాడు అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే…ఇక విశ్లేషణ విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చాలా మంచి పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ని స్క్రీన్ మీద చూస్తున్న అభిమానులు పునకలతో ఆగిపోయారనే చెప్పాలి. అయితే సినిమా కథలో ఉన్న క్వాలిటీని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో మాత్రం ఫెయిల్ అయిపోయారు. ఫస్టాఫ్ కొంతవరకు ఓకే అనిపించినప్పటికి సెకండాఫ్ లో వచ్చే ఏ ఎలిమెంట్ కూడా ప్రేక్షకుడిని పెద్దగా మెప్పించలేకపోయాయి.ముఖ్యంగా హీరో హీరోయిన్ ఎలిమెంట్స్ కానీ, అడ్వెంచర్స్ కు సంబంధించిన ఎలిమెంట్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ ప్రేక్షకుడిని ఏమాత్రం ఇంపాక్ట్ కి గురి చేయవు. జస్ట్ మూవీ నడుస్తుందా అంటే నడుస్తుంది. ఆ రేంజ్ లోనే ఉంటుంది తప్ప హై వోల్టేజ్ ఇంపాక్ట్ అయితే ఇవ్వలేకపోయింది. కీరవాణి మ్యూజిక్ కొంతవరకు పర్లేదు అనిపించినప్పుడు ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయన కూడా ఎలాంటి ఇంపాక్ట్ ను చూపించలేకపోయాడు. ఓవరాల్ గా సినిమా చూస్తున్నంత సేపు ఏదో తెలియని ఒక లో ఫీల్ అయితే కలుగుతోంది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఉన్నాడని ఒక బలమైన సంకల్పంతో సినిమాను చూడడమే తప్ప ఇందులో పెద్దగా మెప్పించే ఎలిమెంట్స్ అయితే లేవు…ఇక కథని రాసుకున్న విధానం కానీ, సీన్స్ ను అల్లుకున్న పద్ధతి కానీ అన్ని బాగున్నప్పటికి స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ కొంతవరకు తడబడ్డాడు. పెద్దగా ఎక్స్పీరియన్స్ లేకపోవడం స్టార్స్ ని హ్యాండిల్ చేసే కెపాసిటీ లేకపోవడం వల్లే, ఈ సినిమా అంత ఎఫెక్టివ్ గా రాలేదు… పవన్ కళ్యాణ్ యాక్షన్ పర్లేదు అనిపించినప్పటికి ఎంతసేపు ఒకే టైప్ ఆఫ్ ఫైట్స్ ని చూసిన ఫీలింగ్ అయితే కలుగుతోంది. ఒక్కసారి చూస్తే బాగా అనిపిస్తుంది. కానీ పదే పదే చూడడం వల్ల ప్రేక్షకుడికి బోర్ కొడుతుందిఇక ఆర్టిస్టులు పర్ఫామెన్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ వీరమల్లు పాత్రలో చాలా ఒదిగిపోయి నటించాడు. ఆయన చేసిన ఈ పాత్ర ఆయనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఇలాంటి పాత్రని పోషించలేదు. కాబట్టి ఆయన పాత్ర మేరకు ఆయన పర్ఫెక్ట్ గా తన క్యారెక్టర్ ని డెలివర్ చేశాడు… ఇక ఔరంగజేబుగా నటించిన బాబి డియోల్ చాలా మంచి పర్ఫామెన్స్ అయితే అందించాడు. ఇంతకుముందు అనిమల్ డాకు మహారాజు సినిమాలో తన విలనిజాన్ని చూపించిన ఆయన ఈ సినిమాలో కూడా తన క్రూరత్వాన్ని చూపించాడు… ఇక మిగిలిన ఆర్టిస్టులందరు కూడా వాళ్ళ పర్ఫామెన్స్ ని పర్ఫెక్ట్ గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. నిధి అగర్వాల్ తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది…ఇక ఈ మూవీ టెక్నికల్ అంశాల విషయానికి వస్తే కీరవాణి హై వోల్టేజ్ మ్యూజిక్ ని అందించడంలో కొంతవరకు ఫెయిల్ అయిపోయాడు. ఈ సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే మనోజ్ పరమహంస సైతం భారీ విజువల్స్ అందించలేకపోయాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంత పెద్ద ఎఫెక్టివ్ గా అయితే అనిపించలేదు. ఇంకాస్త డబ్బులు పెట్టి చాలా రిచ్ గా తీసి ఉంటే సినిమా క్వాలిటీ అనేది బాగా వచ్చేది. ఎడిటింగ్ కూడా అంతే ఎఫెక్టివ్ గా లేదు.