YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం విదేశీయం

మధ్యతరగతి నుంచి... దేశఅధ్యక్ష స్థాయికి...

మధ్యతరగతి నుంచి... దేశఅధ్యక్ష స్థాయికి...

మధ్యతరగతి నుంచి వచ్చిన జో బైడెన్ అగ్రరాజ్యం అమెరికా కు అధ్యక్షుడయ్యారు. 77 ఏళ్ల వయసులో ఆయన కల నెరవేరింది. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన జోబైడెన్ గతంలో ఆరు సార్లు సెనేటర్ గా ఎన్నికయ్యారు. గతంలో రెండు సార్లు అధ్యక్ష పదవికి పోటీ పడినప్పటికీ ఆయనకు సొంత పార్టీ డెమొక్రాట్ల నుంచే అవకాశం లభించలేదు. దీంతో చివరకు మొన్నటి ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థిగా ఎన్నికయి అమెరికా అధ్యక్షుడయ్యారు.ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండుసార్లు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. జో బైడెన్. జో బైడెన్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. సామాన్య, మధ్య తరగతి కుటుంబం. సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల్లో ఆయన స్థిరపడ్డారు. చిన్న నాటి నుంచే రాజకీయాల్లో జో బైడెన్ కు ఆసక్తి ఉండేది. సైరకాస్ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందిన జో బైడెన్ 1972లో తొలిసారి డెలావర్ రాష్ట్రం నుంచి సెనేటర్ గటా ఎన్నికయ్యారు. అతి చిన్న వయసులో సెనేటర్ గా ఎన్నికై అప్పట్లో రికార్డు సృష్టించారు.జో బైడెన్ మొదటి భార్య 1972 లో కారు ప్రమాదంలో మరణించారు. తిరిగి 1977లో జో బైడెన్ జిల్ జాకబ్స్ ను రెండో వివాహం చేసుకున్నారు. జో బైడెన్ ఒక కుమారుడు బ్రెయిన్ ట్యూమర్ తో మరణించారు. అందుకే జో బైడెన్ ఎక్కువ వైద్య, ఆరోగ్యంపైనే ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒబామా హెల్త్ కేర్ ను కూడా తీసుకురావడంలో ఆయన కృషి ఉంది. జో బైడెన్ రాజకీయ వేత్త మాత్రమే కాదు పుస్తక రచయిత కూడా.జో బైడెన్ రచనలు, ఉపన్యాసాల ద్వారానే లక్షల డాలర్లు సంపాదించారు. జో బైడెన్ అనేక యూనివర్సిటీల్లో లెక్చర్లు ఇస్తుంటారు. తద్వారా ఆదాయాన్ని గడిస్తున్నారు. పెన్ బైడెన్ సెంటర్ ఫర్ డిప్లమసీ అండ్ గ్లోబల్ ఎంగేజ్ మెంట్ లో జో బైడెన్ విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. న్యూజెర్సీ యూనివర్సిటీలో కూడా విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఇలా సాగిన జో బైడెన్ ప్రస్థానం చివరకు అమెరికా అధ్యక్ష పదవిపై నిలబెట్టింది. అమెరికాకు 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు

Related Posts