YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి తెలంగాణ

సెమిస్టర్ లేకుండానే ఈ ఏడాది డిగ్రీ

సెమిస్టర్ లేకుండానే ఈ ఏడాది డిగ్రీ

 కరోనా కారణంగా ఈసారి డిగ్రీ ప్రవేశాలు ఆలస్యం కావడంతో రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కోర్సుల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సెమిస్టర్ విధానం తొలగించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక విద్యా కోర్సుల్లో మొదటి సంవత్సరంలో సెమిస్టర్ విధానం తొలగించాలని నిర్ణయం తీసుకోగా, డిగ్రీలో కూడా అదే విధానాన్ని కొనసాగించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుండగా, డిగ్రీ తరగతులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. వారం రోజుల్లో డిగ్రీ తరగతులను ప్రారంభించే అంశంపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. సాధారణంగా ఏటా జూలైలో తరగతులు ప్రారంభమై నవంబర్ లేదా డిసెంబర్‌లో మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయి.ఈసారి నవంబర్ రెండవ వారం వచ్చినా ఇప్పటివరకు తరగతులు ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో సెమిస్టర్ విధానాన్ని తొలగించే అంశంపై విద్యాశాఖ ఆలోచిస్తున్నట్లు సమాచారం. గత మూడేళ్లు నుంచే ఫస్టియర్ నుంచి సెమిస్టర్ విధానం అమలు చేస్తున్నారు. . అంతకుముందు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు వార్షిక పరీక్షలు మాత్రమే నిర్వహించే వారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో గతంలో ఉన్న విధానాన్ని అమలు చేసే అంశాన్ని విద్యాశాఖ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ సజావు జరుగుతోంది. ఇప్పటికే దోస్త్ ద్వారా మూడు విడతల్లో ప్రవేశాలు ముగియగా, ప్రస్తుతం నాలుగవ విడత ప్రవేశాలు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రవేశాలు పూర్తయిన తర్వాత తరగతులు నిర్వహణ ఎలా..? అనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. కోవిడ్ 19 పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ డిగ్రీ తరగతుల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కొన్ని కళాశాలల్లో డిగ్రీ రెండవ, మూడవ సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతుండగా, మొదటి సంవత్సరం విద్యార్థులకు కూడా కొంతకాలం పాటు ఆన్‌లైన్ తరగతులే నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. దోస్త్ రిపోర్టింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత డిగ్రీ మొదటి సంవత్సరం తరగతుల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కోవిడ్- 19 నేపథ్యంలో డిగ్రీ కోర్సుల తరగతులను ఆన్‌లైన్ వేదికగా నిర్వహించడమే మేలన్న అభిప్రాయాలు వ్యక్తమమయ్యాయి.

Related Posts