YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కుంగింది బ్యారేజి కాదు, మీ బ్రెయిన్ ఉత్తం గారు.

కుంగింది బ్యారేజి కాదు, మీ బ్రెయిన్ ఉత్తం గారు.

హైదరాబాద్
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తీరు బోడిగుండుకు మోకాలికి ముడి పెట్టినట్లు ఉంది.మోటార్లు ఆన్ చేసి పొలాలకు నీళ్లు ఇవ్వాలని మేం అడిగితే, కుంగిన బ్యారేజ్ నుంచి ఎత్తిపోయాలా అని ప్రశ్నిస్తున్నారని మాజీ మంత్రి , ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కుంగింది బ్యారేజి కాదు, మీ బ్రెయిన్ ఉత్తం గారు. మేడిగడ్డలో ఒక్క పియర్ కుంగితే, మీ బ్రెయిన్ మాత్రం మొత్తం కుంగినట్లుంది. అసలు బ్యారేజీకి, మోటార్లు ఆన్ చేయడానికి ఏమైనా సంబంధం ఉందా ఉత్తం గారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నారు.
కన్నెపల్లి పంప్ హౌజ్ మినిమం డ్రా లెవల్ 93.5 మీటర్లు అయితే 96 మీటర్ల ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్నాయి.. కన్నెపల్లి పంపు హౌస్ మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశాం. అది చేయకుండా మళ్ళీ అవే బురద రాజకీయాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
గోదావరి నీళ్లను రైతుల పొలాలకు మళ్లించాలని మేము అడుగుతుంటే, సాకులు చెబుతూ నీళ్లు కిందకు వదులుతున్నారు.  283 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన రికార్డు ఎలా సాధ్యం అయ్యింది ఉత్తం గారు? మీ 19 నెలల పాలనలో ఒక్క ప్రాజెక్టు కట్టారా? ఒక్క చెక్ డాం నిర్మించారా? ఒక్క చెరువు పూడిక తీశారా? కొత్తగా ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చారా?  కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ సిస్టమ్ వల్లనే రిజర్వాయర్లు నిండాయి, చెక్ డ్యాంలు చెక్ డ్యాంలు మత్తళ్లు దుంకాయి, చెరువులు నిండుకుండలా మారాయి, భూగర్భ జిల్లాలు పెరిగాయి, పొలాలకు నీళ్ళు అందాయి.బిఆర్ఎస్ సాధించిన ఘనతను, కాంగ్రెస్ ఘనతగా చెప్పుకుంటూ తిరగటం తప్ప మీరు చేసింది ఏముంది?కల్వకుర్తి విషయంలో మీరు ఇచ్చిన ప్రెస్ నోట్ లోనే మీకు సమాధానం ఉంది. నీటి నిల్వల ఆధారంగా ఒక్కో ఏడాది ఒక్కో తేదీన లిఫ్టులు ఆన్ చేస్తుంటారు. మే 30న శ్రీశైలానికి వరద వస్తే ఇప్పటివరకు కల్వకుర్తి మోటార్లు ఎందుకు ఆన్ చేయలేదు. వరద రూపంలో నీళ్లు కిందకు తరలి వెళ్తుంటే జులై, ఆగస్టు అంటూ ముహూర్తాల కోసం ఎందుకు చూస్తున్నారు?రైతు సంక్షేమం పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇదేనా?మొద్దు నిద్ర వీడి, కెసిఆర్ గారు డిమాండ్ చేసినట్లు మోటార్లు ఆన్ చేయండి.. పంట పొలాలకు నీళ్ళు ఇవ్వండి.లేదంటే మీ నిర్లక్ష్యం వల్ల వచ్చే కృత్రిమ కరువుకు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Related Posts