YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ధాన్యం సేకరణ ఎలా...

ధాన్యం సేకరణ ఎలా...

ధాన్యం సేకరణలో ఈ ఏడాది సమస్యలు పునరావృతమయ్యేలా కనిపిస్తున్నాయి. మర ఆడిన తర్వాత బియ్యం నిల్వకు గోడౌన్ల ఇబ్బందులు, మండి ఛార్జీలు వంటి సమస్యలు గతంలో తలెత్తాయి. దీంతో ధాన్యం కొనుగోళ్లులో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఈ ఏడాదీ అవే సమస్యలతో జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికితోడు ఈ ఏడాది అదనంగా మిల్లరుకు మరో సమస్య వచ్చి పడింది. తవుడు, నూకలకూ జిఎస్‌టి చెల్లించాలంటూ వాణిజ్య పన్నులశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ ఏడాదీ ధాన్యం కొనుగోళ్లులో ఆటంకాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.జిల్లాలో ఈ ఏడాది 4లక్షల 87,500 ఎకరాల్లో వరి సాగైనట్లుగా వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మొత్తం 10.14 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రావచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. వ్యవసాయశాఖ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ధాన్యం సేకరణకు జిల్లా అధికారులు 246 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈనెల 20వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. సాధారణ రకానికి క్వింటాకు రూ.1,868, ఎ-గ్రేడ్‌ రకానికి రూ.1,888 ప్రభుత్వం మద్దతు ధరగా ప్రకటించింది.ధాన్యం సేకరణకు మిల్లర్లు ఈనెల 20వ తేదీ లోపు బ్యాంకు గ్యారంటీలు సమర్పించాలని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం గతేడాదికి సంబంధించిన బకాయిలు చెల్లించలేదని తెలుస్తుంది. ఒక్కో మిల్లరుకు కనీసం రూ.10 లక్షలు నుంచి గరిష్టంగా రూ.60 లక్షల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకుండా తాము బ్యాంకు గ్యారంటీలకు సొమ్ములు ఎలా సమకూర్చుకునేదని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బ్యాంకులు కూడా బ్యాంకు గ్యారంటీకి చెల్లించాల్సిన మొత్తాన్ని మరోవైపు బ్యాంకర్లు పెంచినట్లు తెలుస్తోంది. గతంలో రూ.కోటి ధాన్యానికి గతంలో రూ.10 లక్షలు గ్యారంటీ ఇవ్వాల్సి ఉండగా, ప్రస్తుతం దాన్ని రూ.25 లక్షలకు పెంచారు. గోడౌన్ల సమస్య ఈసారి తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధాన్యం మర ఆడిన తర్వాత గోడౌన్ల ఖాళీ లేకపోవడంతో, లారీలకు రోజుకు రూ.2,500 కట్టాల్సి వస్తుంది. గోడౌన్ల సామర్థ్యం మేరకు మిల్లుల నుంచి వచ్చిన ధాన్యం తీసుకునే విధంగా ప్రారంభంలోనే ఏర్పాట్లు చేస్తే సమస్యలు తప్పుతాయని మిల్లర్ల అసోసియేషన్‌ నాయకులు అభిప్రాయపడుతున్నారు.మండీల ఛార్జీల సమస్య ఉండనే ఉంది. ఎపి, తెలంగాణలో మండీలు లేకుండానే మిల్లర్లకు డబ్బులు చెల్లించామని, వాటిని తిరిగి చెల్లించాలని గతేడాది భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) మిల్లర్లకు నోటీసులు జారీ చేసింది. ఒక్కో మిల్లరు కనీసం రూ.రెండు లక్షల నుంచి రూ.15 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. 2007-08 నుంచి 2012-13 వరకు తాము చెల్లించాల్సిన డబ్బులను చెల్లించిన తర్వాతే ధాన్యం తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుంటే గానీ సమస్య పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు.ధాన్యం మర ఆడిన తర్వాత వంద కేజీల బియ్యానికి మిల్లరు 67 కేజీల బియ్యం ఇస్తున్నారు. తమకు 57 నుంచి 62 కేజీలే వస్తాయని మిల్లర్లు చెప్తున్నారు. మర ఆడడం ద్వారా మిల్లర్లు ఐదు నుంచి 10 కేజీలను కోల్పోవడంతో ప్రభుత్వం నూకలు, తవుడును వారికే విడిచిపెడుతోంది. నూకలు, తవుడుకు ప్రభుత్వం మిల్లింగ్‌ ఛార్జీలను చెల్లిస్తున్నట్లుగా భావించిన వాణిజ్య పన్నులశాఖ అధికారులు వీటికీ జిఎస్‌టి కింద ట్యాక్సులు చెల్లించాలని నోటీసులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. జిఎస్‌టి అమల్లోకి వచ్చిన 2017-18 నుంచి ఇప్పటివరకు ఆ మొత్తాలను చెల్లించాలని మిల్లర్లకు నోటీసులు ఇస్తుండడంతో, ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు.

Related Posts