YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చర్చనీయంగా జగన్ కామెంట్స్

చర్చనీయంగా జగన్ కామెంట్స్

గుంటూరు, మే 10, 
ఎక్కడ ఉన్నా.. ఎవ్వర్నీ వదలబోం.. పార్టీ నాయకుల సమావేశంలో జగన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా వైసీపీ సానుభూతిపరులను ఇబ్బంది పెడుతున్న పోలీసుల పేర్లు రాసిపెట్టండి అని జగన్ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది 'మన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోండి.. ఎవ్వరినీ వదలం.. సప్త సముద్రాల అవతల ఉన్నా విడిచిపెట్టం.. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదాం' అని వైసీపీ చీఫ్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కామెంట్స్‌పై ఇప్పుడు ఏపీ పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.'కేవలం వైసీపీని ప్రేమించినందుకు, పార్టీని అభిమానించినందుకు.. కార్యకర్తలు పడుతున్న బాధను చూశాను. అందుకే జగన్‌ 2.0 లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తా. ఈరోజు చంద్రబాబు, పోలీసులు చేస్తున్నది దుర్మార్గం. వారు ఏదైతే విత్తనం వేస్తున్నారో.. రేపు అదే పెరుగుతుంది. అందుకే ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్‌ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం.. అది మామూలుగా ఉండదు' అని జ‌గ‌న్ వార్నింగ్‌ ఇచ్చారు.'ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను చూశాక నేను ఒకటే చెబుతున్నాను.. ఇప్పుడు బాధపడుతున్న కార్యకర్తలకు పూర్తి న్యాయం చేస్తాను. ఈరోజు తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు. సంబంధం లేకున్నా కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు గతంలో ఏనాడూ చూడలేదు. చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే.. ఆయన ప్రజల్లో చులకన అయ్యారు. హామీలు అమలు చేయడం లేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. కాబట్టి, ఎవరూ ప్రశ్నించకూడదని, రాష్ట్రంలో భయానక పరిస్థితి సృష్టిస్తున్నాడు' అని జగన్ వ్యాఖ్యానించారు'ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ప్రజల్లో వ్యతిరేకత కనిపించినా, వెంటనే డైవర్షన్‌ పాలిటిక్స్ చేస్తున్నారు. ఒకరోజు తిరుపతి లడ్డూ అంటారు. ఇంకోరోజు సినీ నటి కేసు అంటారు. చూస్తుండగానే ఏడాది గడిచింది. కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయి. మనం గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే.. ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే. ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవ్వరినీ వదిలిపెట్టబోము' అని జగన్ స్పష్టం చేశారు.జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు.. అటు రాజకీయ నాయకుల్లో.. ఇటు పోలీసు వర్గాల్లో చర్చకు దారితీశాయి. గతంలో కూడా జగన్ కొందరు పోలీసు అధికారుల పేర్లు చెప్పిమరీ వార్నింగ్ ఇచ్చారు. కానీ.. నేరుగా పేర్లు రాసిపెట్టండి.. తర్వాత వాళ్ల సంగతి చెబుదాం అని ఎప్పుడూ అనలేదు. దీంతో పోలీసుల్లో జగన్ కామెంట్స్‌పై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేసే ఎస్సై, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు దీనిపై చర్చించుకుంటున్నారు.జగన్ చేసిన ఈ కామెంట్స్ వైసీపీలో జోష్ నింపాయని.. ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. 'వాస్తవానికి క్షేత్ర స్థాయిలో మా పార్టీ కార్యకర్తలు, నాయకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలామందిపై తప్పుడు కేసులు నమోదు చేశారు. చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వైసీపీ సానుభూతిపరులను ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ జగన్ దృష్టికి తీసుకెళ్లాం. వారికి మనం అండగా నిలుద్దామని జగన్ హామీ ఇచ్చారు'

Related Posts