YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం తెలంగాణ

టెస్టులతో బేజారవుతున్న జనం

టెస్టులతో బేజారవుతున్న జనం

కరీంనగర్, నవంబర్ 16,
ప్రైవేటు దవాఖా నాలు.. దగాకోరుతనానికి నిలయాలుగా మారాయి. అందులోని వైద్య సిబ్బంది దోపిడీ దొంగలుగా మారా రు. వారిని ప్రోత్సాహిస్తూ.. దోపిడికి మరింత పదును పెట్టాలంటున్నాయి గజదొంగ యజమాను లు. ఇలా వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ.. రోగికి ఆపరేషన్ అవసరం లేకున్నా.. వారి కడుపులో కత్తెరలు దూస్తూ వైద్య వృత్తికి తీరని ద్రోహం చేస్తున్నారు. లేని రోగాలు అంటగడుతూ పబ్బం గడుపుతున్నారు.పల్లె నుంచి పట్టణం వరకు ఏ ప్రైవేటు ఆసుపత్రిలో చూసిన అవి రోగులతో కిటకిటలాడుతూ.. వైద్యులకు రెండు చేతులా సంపాదించి పెడుతుంది. పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణగండంలా.. ఇక ఇక్కడి నుంచి వైద్యుల ధనదాహం.. రోగికి అప్పుల భారంలా తయారై.. రోగం కంటే ఖర్చుల భయం వెంటాడుతోంది. వైద్యుల ఫీజు, టెస్టుల భయం.. మందుల ఖర్చు ఇలా ఒకదానికి ఒకటి గొలుసుకట్టుగా మారి.. రోగానికి మరో రోగం తోడై కడకు ఆపరేషన్ సక్సెస్... రోగి మృతిలాగా.. ఆ రోగి రోగం ముదిరి ప్రాణానికే ముప్పు ఏర్పడుతున్న సంఘటనలు నేటి సమాజంలో అనేకంగా ఉన్నాయి. శీతాకాలం, వానాకాలం వచ్చిందంటే.. కాలాను గు ణంగా వచ్చే వ్యాధులతో ప్రైవేటు, ప్రభుత్వ ఆసు పత్రులు రోగులతో కిక్కిరిసి పోయుంటాయి. ఏ చిన్న పాటి సుస్తి చేసి... తగ్గక పోయేసరికి ఆసుపత్రి గడపతొక్కడం నేడు ప్రతి ఇంటా జరుగుతున్నదే. అదే భావించిన ఆసుపత్రుల యాజమాన్నాయలు తొలత రుసుము రూపంలో రూ.100 నుంచి ఆసుపత్రి హంగులను బట్టి 200, 300, 500,1000 ఇలా ఇం కా ఇంకా వసూలు చేస్తుంటాయి.అనంతరం వైద్యుడు రోగిని చూడటం ఎందుకైనా మంచిదని డెంగీ, మలేరియా లాంటి విష జ్వరాలకు సంబంధించిన టెస్టులు రాసి ఆసుపత్రి సమీపంలోనే, లేదా ఆసుపత్రి లోనే ఉండే ల్యాబ్‌లకు పంపిస్తారుర. వాటికి రూ. వేలల్లో వసూలు చేస్తారు. ఇంకొందరు వైద్యులు చేతి నొప్పనో, కాలు నొప్పనో వెళితే బోన్ క్యాన్సర్ లేదా ఎమ్మారై టెస్టులు రాసి రూ.20 వేలకు బిల్లు తగ్గకు ండా చూసి పంపించేస్తున్నారు. అనంతరం వచ్చిన రిపోర్టులను చూసి... భయపడాల్సింది ఏమి లేదు.

Related Posts