YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

స్పీడ్ మీద ప్రభాస్

స్పీడ్ మీద ప్రభాస్

హైదరాబాద్, నవంబర్ 20, 
ప్రభాస్ స్పీడు చూస్తే.. అమ్మో అనిపిస్తుంది. ఎప్పుడూ స్లో గా ఉండే ప్రభాస్ తాజాగా వరసబెట్టి సినిమాలకు కమిట్ అవుతున్నాడు. రాధేశ్యాం షూటింగ్ అవ్వకముందే.. నాగ్ అశ్విన్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ సినిమాలను లైన్ లో పెట్టిన ప్రభాస్ రాధేశ్యాం షూటింగ్తో పాటుగా.. ఓం రౌత్ ఆదిపురుష్ కథ చర్చల కోసం ముంబై లో తిరుగుతున్నాడు. జనవరి నుండి షూటింగ్ మొదలుపెట్టుకోకున్న ప్రభాస్ ఆదిపురుష్ విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ఫిక్స్ అయ్యాడు.ఇంకా హీరోయిన్ ఫిక్స్ చెయ్యని దర్శకుడు రేపో మాపో ఆ పేరుని రివీల్ చేస్తదనుకునే టైం లో ప్రభాస్ ఆదిపురుష్ రిలీస్ డేట్ ఇచ్చి ప్రభాస్ ఫాన్స్ కి వరసగా షాకులివ్వడం, సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఓం రౌత్ ప్రభాస్ ఆదిపురుష్ విషయంలో ఎంత ఫాస్ట్ గా ఉన్నాడో విలన్, టైటిల్  అండ్ రిలీజ్ డేట్ చూస్తే తెలిసిపోతుంది. మరి బాలీవుడ్ మూవీస్ మొదలవ్వగానే రిలీజ్ డేట్ ఇచ్చినట్టుగా ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఇంకా మొదలు పెట్టకముందే ఆగష్టు 11  2022 లో ఆదిపురుష్ రిలీజ్ అంటూ ఓం రౌత్ ప్రకటించడంతో ప్రభాస్ ఫాన్స్ షాకయ్యారు. ఆసలు ప్రభాస్ సినిమాల స్పీడు ఈ రేంజ్ లో ఉంటుంది అనీ ప్రభాస్ ఫాన్స్ ఊహించి ఉండరు. ఆదిపురుష్ అప్ డేట్స్ ఈ రేంజ్ లో ఉంటున్నాయంటే.. ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాని ఏం చెయ్యబోతున్నాడో  ఆనే క్యూరియాసిటీ ఇప్పుడు ఫాన్స్ లో మొదలయ్యింది.

Related Posts