YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

టార్గెట్ మహారాష్ట్ర....

టార్గెట్ మహారాష్ట్ర....

బీహార్ ఎన్నికల్లో విజయంతో భారతీయ జనతా పార్టీ కన్ను మహారాష్ట్రపై పడిందంటున్నారు. మహారాష్ట్రలోని శివసేన సర్కార్ ను కుప్పకూల్చడమే లక్ష్యంగా బీజేపీ పెట్టుకుందనిపిస్తుంది. బీహార్ ఎన్నికల్లో గెలుపు వెనక మోదీ ఇమేజ్ ప్రధాన కారణమని అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనమయిపోయింది. బీహార్ లో కాంగ్రెస్ పరిస్థితిని చూసిన వారెవరైనా దానితో జట్టుకు సిద్దపడే అవకాశం లేదు.అందుకే బీజేపీ ఇప్పుడు మహారాష్ట్ర సర్కార్ పై కన్నేసింది. మహారాష్ట్రలో కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తుంది. ఇప్పటికే మూడు పార్టీలో విభేదాలు తలెత్తాయంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పూర్తి అసంతృప్తిలో ఉన్నారు. ఉద్ధవ్ థాక్రే తమను కేర్ చేయడం లేదని, శరద్ పవార్ చెప్పినట్లే నడుచుకుంటున్నారన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది.మంత్రి వర్గంలోనూ తమకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీనిపై హైకమాండ్ కు ఫిర్యాదు చేసినా పెద్దగా ఫలితం లేదు. దీంతో ఇప్పుడు బీజేపీ ఆపరేషన్ కాంగ్రెస్ స్టార్ట్ చేసిందంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమవైపునకు ఎక్కువ సంఖ్యలో తిప్పుకోగలిగితే ఎన్సీపీ కూడా కలసి వస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందుకే తొలుత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.అందుకే మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ త్వరలోనే మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని జోస్యం చెప్పారు. సర్కార్ పడిపోయిన వెంటనే తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఫడ్నవిస్ ధీమా వ్యక్తం చేయడం వెనక అదేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేక తమ వైపు ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు వస్తారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. త్వరలోనే మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని విశ్లేషకులు సయితం

Related Posts