YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దు నగర సీపీ అంజనీకుమార్

సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దు నగర సీపీ  అంజనీకుమార్

హైదరాబాద్ నవంబర్ 21,
బల్దియా ఎన్నికలపై భద్రత ఏర్పాట్ల విషయంలో  సిటీ లో వున్న అన్ని డి అర్ సి కేంద్రాలను పరిశీలించాం. బల్దీయా సిబ్బంది తో  చర్చించామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు  శనివారం అయన ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని డీఆర్ సీ సెంటర్ ను పరిశీలించారు. తరువాత సీపీ మాట్లాడుతూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బల్దియా ఎన్నికలు నిర్వహించడం తమ బాధ్యత. ఈ అంశంపైనా బల్దియా సిబ్బందితో పోలీసులతో చర్చించాం. డి అర్ సి  కేంద్రంలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ రూమ్,సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ లను పరిశీలించాను. లొకేషన్ ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడానని అన్నారు. ఇప్పటి వరకు పట్టుబడిన నగదు అంతా ఇన్కమ్ టాక్స్ అధికారులు అప్పజెప్పాం. ఆయుధాలు లైసెన్స్ కలిగిన వారు ఎన్నికల సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించాలి. 15వందల లైసెన్స్ ఆయుధాలు ఆయా పోలీస్ స్టేషన్లో డీపాజిట్ చేశారు.సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేసాం. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి అన్ని స్ట్రాంగ్ రూమ్ సువిశాలంగా ఏర్పాటు చేశామని అన్నారు. ఇప్పటికే ఫ్లాగ్ మార్చ్ చేసాం. అన్ని సమస్యాత్మక సున్నితమైన ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేసామని అన్నారు. స్పెషల్  స్క్వాడ్ టీమ్స్ వున్నాయి. ఎవరు అయిన ఎన్నికల నియమావళి ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవు.. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు ప్రజలు నమ్మవద్దు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని అయన అన్నారు.

Related Posts