YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

గాంధీలో పునఃప్రారంభ‌మ‌యిన సాధార‌ణ వైద్య సేవ‌లు

గాంధీలో పునఃప్రారంభ‌మ‌యిన సాధార‌ణ వైద్య సేవ‌లు

హైద‌రాబాద్‌ నవంబర్ 21 
‌గాంధీ ద‌వాఖాన‌లో సాధార‌ణ వైద్య సేవ‌లు పునఃప్రారంభ‌మ‌య్యాయి. రాష్ట్రంలో క‌రోనా కేసులు పెర‌గ‌డంతో గాంధీ ద‌వాఖాన‌ను సుమారు 8 నెల‌ల క్రితం పూర్తిస్థాయి కొవిడ్ కేంద్రంగా మార్చారు. అయితే పాజిటివ్ కేసులు త‌గ్గుముఖంప‌ట్ట‌డంతో ద‌వాఖాన‌లో మ‌ళ్లీ నాన్ కొవిడ్ వైద్య సైవ‌లు ప్రారంభించాల‌ని వైద్య‌విద్య సంచాల‌కులు ఈనెల 12న ఉత్త‌ర్వులు జారీచేశారు. దీంతో అధికారులు నేటినుంచి సాధార‌ణ వైద్యసేవ‌ల‌ను ప్రారంభించారు.ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు సాధార‌ణ ఓపీ సేవ‌లు కొన‌సాగుతాయ‌ని హాస్పిట‌ల్ వ‌ర్గాలు తెలిపాయి. స‌ర్జిక‌ల్‌తోపాటు గ‌తంలో ద‌వాఖానలో అందుబాటులో ఉన్న అన్నిర‌కాల వైద్య‌సేవ‌లు య‌థావిధిగా కొన‌సాగుతాయ‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. క‌రోనా, సాధార‌ణ వైద్య సేవ‌ల‌కు వేర్వేరు ప్ర‌వేశ మార్గాల‌ను ఏర్పాటు చేశారు. గాంధీలో  ప్ర‌స్తుతం మూడు వంద‌ల‌లోపే క‌రోనా రోగులు చికిత్స పొందుతున్నారు.  
 

Related Posts