YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పుష్ప కోసం మరో హీరో

పుష్ప కోసం మరో హీరో

చెన్నై, నవంబర్ 24, 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. రష్మిక మందానా హీరోయిన్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారని గతంలో వార్తలొచ్చాయి. దీంతో పుష్ప సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.దీంతో ఆ పాత్ర పోషించే నటుడి కోసం యూనిట్ మళ్లీ జల్లెడ పడుతోంది. ఈ నేపథ్యంలో ఉపేంద్ర, సుదీప్‌, ఆర్య వంటి వారి పేర్లు వినిపించినా యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ పాత్ర కోసం విలక్షణ నటుడు విక్రమ్‌ను సంప్రదిస్తున్నట్లుగా ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది. విక్రమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అందరికీ తెలిసిందే. పాత్ర కోసం ప్రాణం పెట్టే నటుల్లో ముందు వరుసలో ఉంటారాయన. ఈ సినిమాలో నిజంగానే విక్రమ్‌ని తీసుకుంటే ‘పుష్ప’ రేంజ్ మరింత పెరగడం ఖాయమని సినీవర్గాలు అంటున్నాయి. దీనిపై యూనిట్ స్పందించాల్సి ఉంది.

Related Posts