YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కరోనాపై 4న ఆల్ పార్టీ మీటింగ్

కరోనాపై 4న ఆల్ పార్టీ మీటింగ్

న్యూఢిల్లీ, డిసెంబర్ 1
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 4న దేశంలోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో విర్చువల్‌గా మాట్లాడనున్నారు. దేశంలో కరోనా స్థితిగతులు, వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్టీల నుంచి అభిప్రాయం తీసుకోనున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం (డిసెంబర్‌ 4) ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి పార్లమెంట్‌ ఉభయ సభల్లోని ఆయా పార్టీలకు చెందిన నేతలు హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ సమావేశాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సమన్వయం చేయనుంది.దేశంలో కరోనాతో ఏర్పడిన సంక్షోభం తర్వాత ఇది రెండో అఖిలపక్ష భేటీ కావడం గమనార్హం. దేశంలో వ్యాక్సిన్ అభివృద్ధి ప్రయోగాలు కీలక దశకు చేరుకోకున్న తరుణంలో నిర్వహిస్తున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా.. నవంబర్ 28న ప్రధాని మోదీ అహ్మదాబాద్, హైదరాబాద్, పుణేలోని ఫార్మా సంస్థల్లో వ్యాక్సిన్ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో ఆసక్తి నెలకొంది.ఈ భేటీ అనంతరం కరోనా వ్యాక్సిన్‌పై ప్రకటన చేసే అవకాశం ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రధాని మోదీ ఇప్పటికే రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయం తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోం మంత్రి అమిత్‌ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తదితరులు హాజరు కానున్నారు.

Related Posts