YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి తెలంగాణ

మన ఊరికి మన గురుకులం

మన ఊరికి మన గురుకులం

తెలంగాణా సాంఘిక గురుకుల విద్యా సంస్థ నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలు, కళాశాలలో  కోవిడ్-19 కారణంగా విద్యార్థినీ విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. విద్యను కడప కడపకూ తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో తిర్యాని మండలం ఉల్లిపిట్ట గ్రామంలో మన ఊరికి~మన గురుకులం కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితి గా విచ్చేసిన తిర్యాని మండల వైస్.ఎంపీపీ కో వపార్వతి మాట్లాడుతూ గురుకులాల నిర్వహించే ఈ కార్యక్రమం కడప కడపకూ వచ్చి విద్యార్థులకు విద్య నేర్పుతున్నదనీ అందరమూ ఉపయోగించుకుందామని అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షుత వహించిన తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల/ కళాశాల ప్రిన్సిపాల్  పర్లపల్లి నరేందర్  మాట్లాడుతూ ఈ కార్యక్రమం ను గ్రామాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలనీ అన్నారు.  ఈ ఉల్లిపిట్ట విలేజ్ లర్నింగ్ సెంటర్ 133వ రోజూ విజయవంతంగా నిర్వహించబడుతుందనీ లర్నింగ్ సెంటర్  లీడర్ మాస్టర్ ఆకాష్ కృషి ని అభినంధిస్తూ ప్రోత్సాహక బహుమతి అందిస్తూ ప్రతీ విలేజ్ లర్నింగ్ సెంటర్ కి రోజూ ఇద్దరు విషయవారీ ఉపాధ్యాయులను నియమించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో స్వేరో జోనల్ బాధ్యులు హేమంత్ షిండే టెక్నికల్ కార్యదర్శి చైతన్య, పేరెంట్స్ కమిటీ వామన్,  రీజినల్ స్పోర్ట్స్ కో ఆర్డనేటర్ శంకర్,  వైస్ ప్రిన్సిపాల్ అబ్దుల్ రహీమ్ పండిత్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related Posts