YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం దేశీయం

దేశంలో వ్యాక్సినేషన్ కోసం కేంద్రం సన్నాహాలు

దేశంలో వ్యాక్సినేషన్ కోసం కేంద్రం సన్నాహాలు

దేశంలో వ్యాక్సినేషన్ కోసం కేంద్రం సన్నాహాలు మొదలుపెట్టింది. అతి త్వరలో వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో పంపిణీ చర్యలను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఆసక్తిగల వారందరూ తమ పేర్లను స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలని సూచించింది. వ్యాక్సిన్  తీసుకోవాలన్న బలవంతం ఏమీ ఉండదని తెలిపింది. పేరు నమోదైన వారికే టీకా అందిస్తారని పేర్కొంది. వ్యాక్సిన్ ఎక్కడ ఎప్పుడు ఇచ్చేదీ ఫోన్ కు సమాచారం వస్తుందని ఆ సమయంలో ఏదో ఒక ఫొటో గుర్తింపు కార్డు చూపటం తప్పనిసరి అని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ కి  సంబంధించి ప్రజలు తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలను శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిందని
వ్యాక్సిన్ లభ్యతను బట్టి ప్రభుత్వం ప్రాధాన్య క్రమంలో ఎక్కువ ముప్పు ఉన్నవారికి ముందుగా ఇస్తుంది. తొలుత వైద్య ఆరోగ్య సిబ్బంది ముందువరుసలో ఉండి సేవలు అందిస్తున్న వారికి... ఆ తర్వాత 50 ఏళ్లకు పైబడినవారు 50ఏళ్లలోపు వయస్సుండి అనారోగ్య సమస్యలున్న వారికి ఇస్తారు. వ్యాక్సిన్ తీసుకోవడం అనేది పూర్తిగా స్వచ్ఛందం. అయితే కరోనా వైరస్ నుంచి రక్షణకు టీకా తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులు సహచరులకు వైరస్ వ్యాపించకుండా నివారించవచ్చు. ఇక వ్యాక్సిన్ కావాలంటే పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరి. పేరు ఇస్తేనే టీకా ఎప్పుడు ఎక్కడ వేసేది చెబుతారు.
ఇక వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తారంటే .. వైరస్ లక్షణాలు తగ్గిపోయిన 14 రోజుల తర్వాత టీకా ఇస్తారు. వైరస్ సోకిందా లేదా అన్నదానితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవడం మంచిది. దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. 28 రోజుల తేడాతో ప్రతి ఒక్కరూ రెండు డోసులు తీసుకోవాలి. రెండో డోస్ తీసుకున్న 2 వారాలకు రోగ నిరోధశక్తి ఏర్పడుతుంది. ఇతర అనారోగ్య సమస్యలున్న వారికి కరోనా ముప్పు ఎక్కువ. కాబట్టి అలాంటి వారు కచ్చితంగా టీకా తీసుకోవాలి. ఇక వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్లు కావాలి అంటే .. డ్రైవింగ్ లైసెన్స్ కార్మికశాఖ జారీచేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్ - ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్ - ఎంపీ - ఎమ్మెల్యే - ఎమ్మెల్యేలు జారీచేసిన అధికారిక ఫొటో గుర్తింపుకార్డు - పాన్ కార్డు - బ్యాంకు/పోస్టాఫీసు పాస్ బుక్కులు - పాస్ పోర్ట్ - పెన్షన్ డాక్యుమెంటు - కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు - ప్రభుత్వరంగసంస్థలు జారీచేసిన ఉద్యోగ గుర్తింపుకార్డులు - ఓటర్ ఐడీలలో ఏదో ఒకటి. ఫొటోతో ఉన్న గుర్తింపుకార్డు సమర్పించాలి. వ్యాక్సిన్ వేసే సమయంలో దాన్ని తనిఖీ చేస్తారు. కాగా కరోనా మహమ్మారి జోరు దేశంలో కొనసాగుతుంది. ప్రతిరోజూ కూడా కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. తాజాగా దేశంలో కరోనా కేసులు కోటి కి చేరుకున్నాయి. దేశంలో  గత 24 గంటల్లో 25153 మందికి కరోనా నిర్ధారణ అయింది.  దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 10004599కు చేరింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 9550712 మంది కోలుకున్నారు. 308751 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు హోం క్వారంటైన్ లలో చికిత్స అందుతోంది

Related Posts