YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

సెకండరీ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్లు ఉన్నవారిలోనే తీవ్రమైన కోవిడ్ ప్రభావం

సెకండరీ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్లు ఉన్నవారిలోనే తీవ్రమైన కోవిడ్ ప్రభావం

హైదరాబాద్ డిసెంబర్ 24
కరోనా వైరస్ చాలా వింతగా తయారైన  విషయం తెలిసిందే. కోవిడ్ సోకిన వాళ్లల్లో కొంతమందికి ఏ లక్షణాలు ఉండటం లేదు. మరికొంతమంది హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకొని వారం పది రోజుల్లో మామూలుగా అయిపోతున్నారు. కొందరికి సాధారణ జలుబు జ్వరంలా వచ్చి పోతుంది. అయితే మరికొంతమందికి మాత్రం సీరియస్ అవుతోంది. ఆస్పత్రిలో అనేకరోజుల పాటు చికిత్సతీసుకొని డిశ్చార్జి అవుతున్నారు. ఇంకొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు.అయితే రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉన్నవాళ్లకు.. ఇతర వ్యాధులు లేనివాళ్లకు ఈ వైరస్ తక్కువగా ప్రభావం చూపుతోందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు ఓ కొత్త విషయాన్ని కనిపెట్టారు. రక్త సంబంధిత వ్యాధులు అంటే రక్తంలో ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్లకు కరోనా సోకితే వాళ్లకు అంత ఈజీగా వ్యాధి నయం కావడం లేదట. కొందరికి ప్రాణాంతకం కూడా అవుతున్నదట. సెకండరీ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్లు ఉన్నవారిలోనే తీవ్రమైన కోవిడ్ ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.  రక్త సంబంధిత ఇన్ఫెక్షన్లు ఉన్నవాళ్లు ఎక్కువకాలం పాటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారని.. అటువంటి వారిలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఈ మేరకు సైంటిస్టులు క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్లో ఓ అధ్యయనాన్ని ప్రచురించారు.  
సెకండరీ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రిలో చేరిన రోగులలో కోవిడ్ ఎక్కువ ప్రభావం చూపినట్టు ఈ పరిశోధనలో తేలింది. మొత్తం 375 మంది రోగులను వీరు పరీక్షించారు. వీరిలో రక్తంలో ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్లకు కరోనా అంత తేలిగ్గా తగ్గలేదు. చాలామందికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చాయి. వీరి మానసికస్థితి ప్రభావం చూపిందని కూడా పరిశోధనలో తేలింది. అయితే ఈ సెకండరీ బ్లడ్ స్ట్రీమ్ ఎందుకు వస్తుందో తెలుసుకొనేందుకు కూడా శాస్త్రవేత్తలు పరిశోధన మొదలుపెట్టారు.

Related Posts