YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం దేశీయం

దేశంలో కొత్తగా 23,068 కరోనా కేసులు నమోదు

దేశంలో కొత్తగా 23,068 కరోనా కేసులు నమోదు

దేశంలో కొత్తగా 23,068 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,46,846కు చేరింది. ఇందులో 2,81,919 యాక్టివ్‌ కేసులు ఉండగా, 97,17,834 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1,47,092 మంది మరణించారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కరోనా బారినపడినవారిలో 336 మంది మరణించగా, 24,661 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నిన్నటికంటే 6.6 శాతం తక్కువగా నమోదయ్యాయని వెల్లడించింది.మహారాష్ట్రలో అత్యధికంగా 19,09,951 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 49,058 మంది మరణించారు. ఇక, కర్ణాటకలో ఇప్పటివరకు 9,13,483, ఆంధ్రప్రదేశ్‌లో 8,80,075, తమిళనాడులో 8,11,115, కేరళలో 7,26,687, ఢిల్లీలో 6,20,681 కరోనా కేసులు నమోదయ్యాయి.


కాగా తెలంగాణ రాష్ట్రంలోకి కొత్త కరోనా రాలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. బ్రిటన్‌ నుంచి రాష్ర్టానికి వచ్చినవారిలో ఇప్పటివరకు 846 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, అయితే వారికి 'బ్రిటన్‌ స్ట్రెయిన్‌' సోకిందో లేదో ఇంకా తేలలేదని, నమూనాలను పరీక్షల కోసం సీసీఎంబీకి పంపించామని వివరించారు. వారు ఎవరెవరిని కలిశారో గుర్తిస్తున్నామని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేద ని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొత్త రకం కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఈటల వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్‌ 8వ తేదీ నుంచి ఇప్పటివరకు బ్రిటన్‌ నుంచి రాష్ర్టానికి సుమారు 1,200 మంది వచ్చారని చెప్పారు. వీరందరినీ ప్రత్యేకంగా పరిశీలిస్తున్నామని, నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చినవారి ఆరోగ్యంపైనా నిఘా ఉంచామని వెల్లడించారు. 'బ్రిటన్‌ స్ట్రెయిన్‌' రకం వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తిచేశారు. క్రిస్మస్‌, న్యూఇయర్‌, సంక్రాంతిని ఇండ్లల్లోనే జరుపుకోవాలని కోరారు. మాస్క్‌, భౌతికదూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పిలుపునిచ్చారు.

Related Posts