YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కరోనాతో సహజీవనం తప్పదా

కరోనాతో సహజీవనం తప్పదా

న్యూఢిల్లీ, డిసెంబర్ 31, 
కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న సమయంలో కొత్త కరోనా వైరస్ ఆందోళన కల్గిస్తుంది. యూకేలో ఇది ప్రారంభమయింది. ఇప్పటికే కొన్ని దేశాలు లాక్ డౌన్ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే అన్ని ప్రపంచ దేశాలు దాదాపు తొమ్మిది నెలలుగా కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతున్నాయి. అన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ఇప్పుడిప్పడే లాక్ డౌన్ లో మినహాయింపులు ఇచ్చి సాధారణ జీవనం ప్రారంభమవుతున్న సమయంలో మళ్లీ కొత్త వైరస్ దేశాలను వణికిస్తుంది.అగ్రరాజ్యం అమెరికాలో 1.87 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. భారత్ లోనూ ఈ సంఖ్య కోటి లక్షన్నరకు చేరుకుంది. భారత్ లోని వివిధ రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాయి. భారత్ లో వ్యాక్సిన్ పంపిణీకి రెడీ అవుతున్నారు. వ్యాక్సిన్ పంపిణీకి ముందే కొత్త రకం వైరస్ వస్తుండటంతో మరోసారి లాక్ డౌన్ తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కరోనా తగ్గిందని ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించకుండా బయటకు వస్తున్నారు.ఇప్పటికే కొత్త కరోనా వైరస్ తో స్పెయిన్ వచ్చే ఏడాది మార్చి వరకు అత్యవసర పరిస్థితిని విధించింది. యునైటెడ్ కింగ్ డమ్ ఒక నెల పాటు లాక్ డౌన్ ను విధించింది. ఫ్రాన్స్ రెండు వారాలు, జర్మనీ నాలుగు వారాలు లాక్ డౌన్ ను విధించాయి. ఇప్పటికే బ్రిటన్ నుంచి భారత్ కు వచ్చిన వారిలో ఐదుగురికి పాజిటివ్ గా తేలడంతో ఆందోళన మొదలయింది. యూకే నుంచి వచ్చే విమానాలను భారత ప్రభుత్వం రద్దు చేసింది.కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే లక్షల సంఖ్యలో ఉపాధిని కోల్పోయారు. మూడు నెలల పాటు ఇంటికే పరిమితం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా వరస పండగలు కూడా ఉండటంతో కొత్త కరోనా వైరస్ పై ప్రభుత్వాల్లోనూ ఆందోళన మొదలయింది. మహారాష్ట్రలో ఇప్పటికే అర్బన్ ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూను విధించారు. ఏదో ఒక వైరస్ తో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక బతకడం కష్టమేనన్న ఆందోళన మొదలయింది. జీవితాంతం హోం ఐసొలేషన్ లోనే ఉండాలా? అన్న చర్చ సామాన్య ప్రజల్లోనూ జరుగుతుండటం విశేషం. వైద్య నిపుణులు కూడా మరో రెండేళ్ల పాటు వైరస్ ప్రభావం ఉంటుందని, అప్పటి వరకూ ప్రజలు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచిస్తున్నారు.

Related Posts