YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు తెలంగాణ

భూవివాదామే కిడ్నాప్ కారణం కిడ్నాపైన ముగ్గురు సురక్షితం

భూవివాదామే కిడ్నాప్ కారణం కిడ్నాపైన ముగ్గురు సురక్షితం

నగరంలోని బోయినపల్లిలో కిడ్నాప్ కు గురైన ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. నార్సింగిలో ముగ్గురిని కిడ్నాపర్లు వదిలి పారిపోయారు. దీంతో  ప్రవీణ్, నవీన్, సునీల్ సురక్షితంగా  ఇంటికి  చేరుకున్నారు.  వీరు సీఎం కేసీఆర్ సోదరి తరఫు సమీప బంధువులు. వీరు ముగ్గురూ సీఎం కేసీఆర్ పీఏ వేణుగోపాలరావుకు బావమరుదులు. గత రాత్రి 11 గంటల సమయంలో  సినీఫక్కీలో హకీ క్రీడాకారుడు ప్రవీణ్రావు కిడ్నాప్కు గురయ్యాడు. ఐటీ అధికారులమంటూ ఇంట్లోకి చొరబడ్డ కిడ్నాపర్లు.. భూమా అఖిలప్రియ భర్త భార్గవ్రామ్ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రవీణ్రావు సహా ఇద్దరు సోదరులను దుండగులు కిడ్నాప్ చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాప్కు గురైన ప్రవీణ్, నవీన్, సునీల్లను వికారాబాద్లో గుర్తించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా...మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అఖిలప్రియ భర్త భార్గవ్రామ్ సోదరుడు చంద్రహాస్ పోలీసుల అదుపులో ఉన్నారు. హాఫీజ్పేటలోని వంద కోట్ల విలువైన భూమి కోసం కొంతకాలంగా గొడవ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ సోదరుడు ప్రతాప్ మాట్లాడుతూ ప్రొఫెషనల్స్ లా దుండగులు ఇంట్లోకి వచ్చారు. నెట్ ద్వారా సీసీటీవీ కెమెరాల్లో ఇంటి దగ్గర ఏం జరిగిందో గమనించా..అనుమానం కలిగింది. మా సిస్టర్ ఇన్ లా వచ్చి చూస్తే పరిస్తితి అర్థమైంది..వెంటనే పోలీస్ లను ఆశ్రయించాము. ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ కు తీసుకువెళ్ళాలి అని తీసుకువెళ్ళారు. పోలీస్ వేషం లో రావడం వల్ల ప్రశ్నించలేదని అన్నారు.
మొఖానికి మాస్క్ వేసి బండిలో మా సోదరులను తరలించారు. ఒక బ్రదర్ మాస్క్ కన్నంలోంచ్ చూస్తే చిలుకూరు వైపు  అని గమనించారు.  ఓ ఫామ్ హౌజ్ కు తీసుకెళ్లారు. కొన్ని పేపర్ పైన సంతకాలు చేయించుకున్నారు. పరిస్థితి తెలిసి వెంటనే ఎంపీ మలోతు కవిత , మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. అర్ధరాత్రి మా ఇంటికి చేరుకొని విషయం అడిగి తెలుసుకున్నారు పోలీసులను అప్రమత్తం చేశారు. ఈడీ, ఐటీ  రైడ్ లేదని తెలిసింది. వెంటనే పోలీస్ లు స్పందించి, కిడ్నాప్ గా భావించారు. తెలంగాణ పోలీస్ లు వెంటనే చర్యలు చేపట్టారు. సీసీటీవీ సంబంధించి హర్డ్ డిస్క్, వంటివి అడిగారు. బైటికి ఏం తెలియకుండా ఉండాలని జాగ్రత పడ్డారు. మా అనుమానం, పోలీస్ ల ప్రైమాఫెసీ ఒకటే అని అనిపిస్తోంది. 50 ఎకరాల భూమి వివాదం లోనే ఈ కిడ్నాప్ జరిగిందని భావిస్తున్నామని అన్నారు.
 

Related Posts