YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

పత్తికొండ డిగ్రీ కళాశాలలో ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు బారులు తీరిన విద్యార్థిని విద్యార్థులు

పత్తికొండ డిగ్రీ కళాశాలలో ఆన్లైన్  అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం  ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు బారులు తీరిన విద్యార్థిని విద్యార్థులు

పత్తికొండలో ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ, మరియు ఆక్వా కల్చర్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ  వంటి భవిష్యత్ ఉపాధి అవకాశాలకు గల కోర్సులలో ప్రవేశాల కోసం పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో చేరడానికి విద్యార్థులు పోటెత్తిన సంఖ్యలో హాజరు కావడం జరిగింది. ఇందులో భాగంగా ఉన్నత విద్యాశాఖ ప్రవేశాలకు ప్రకటన జారీ చేసిందని తెలియడంతో ఒక్కసారిగా విద్యార్థినీ విద్యార్థులతో కళాశాలలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ బి. కృపేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ఆయా కోర్సుల్లో చేరడానికి సంబంధిత వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఈనెల 17వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఈనెల 9వ తేదీ నుండి 17వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, 11 మరియు 12 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని, 20వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుందని, 21 నుండి 23 వరకు విద్యార్థులు కళాశాల లో హాజరు అవ్వడానికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.

విద్యార్థుల సౌకర్యార్థం, విద్యార్థినీ విద్యార్థుల కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కొరకు హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ హెల్ప్లైన్ ద్వారా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థినీ విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలియజేశారు..
ఈ కళాశాలలో ఉత్తమ బోధన  మరియు అత్యుత్తమ ఫలితాలు సాధించడం కళాశాలకు హర్షించదగ్గ విషయమని తెలియజేశారు.

Related Posts