YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

రోజుకు 13 లక్షల మందికి వ్యాక్సి నేషన్

రోజుకు 13 లక్షల మందికి వ్యాక్సి నేషన్

న్యూఢిల్లీ, జనవరి 8, 
కోవిడ్-19 వాక్సినేషన్ తొలి దశలో రోజుకు 13 లక్షలమందికి టీకాలు వేయగలిగితే చాలా త్వరగా కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టవచ్చని ఎస్బీఐ పరిశోధన నివేదించింది. భారత్‌కు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ రూపొందించిన కోవిషీల్డ్, భారత బయోటెక్‌ సంస్థ రూపొందించిన కోవాక్సిన్ టీకాలకు డ్రగ్ రెగ్యులేటర్ ఆమోదం తెలుపటంతో కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం నుంచి దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారభించనుంది.
ప్రభుత్వం ఈ ఆగస్టు నాటికి 30 కోట్లమందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే రోజుకు 13.27 లక్షల మందికి టీకాలు వేయగలిగితేనే కేంద్రం తన లక్ష్యాన్ని నెరవేర్చుకోగలదు.
అయితే రోజుకు 15,645 మందికి టీకాలు వేస్తే చాలు వందశాతం టీకాలు వేయకున్నప్పటికీ కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చని ఎస్బీఐ తాజా పరిశోధన తెలిపింది. ఎస్బీఐ నివేదిక చెబుతున్న దాని ప్రకారం రోజుకు కనీసం 15,645 మందికి టీకాలు వేయగలిగితే వైరస్ వ్యాప్తి విషయంలో సమతుల్యత తేవచ్చని భారతీయ స్టేట్ బ్యాంకు తాజా పరిశోధన నివేదిక తెలిపింది. ప్రభుత్వం 13 లక్షలమందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆ లెక్కన దేశం వ్యాధిరహిత స్థితికి చేరుకోగలుగుందని నివేదిక తెలిపింది. కేంద్రం చెబుతున్నట్లు రోజుకు దేశంలో 13 లక్షలకు పైగా టీకాలు  వేయటం అటే అసాద్యమైన పనిగా కనిపిస్తోంది. గతంలో భారత ప్రభుత్వం నాలుగు నెలలకాలంలో 12.5 కోట్ల జన్ థన్ ఖాతాలను తెరవగలిగింది. అంటే రోజుకు 8 లక్షల ఖాతాలను తెరిచిందన్నమాట.దేశంలో ప్రస్తుతం సోకుతున్న అంటువ్యాధులు, మరణాల సంఖ్య ప్రాతిపదికన ఈ నివేదికను తయారు చేసారు. గత కొన్ని వారాలుగా దేశంలో కోవిడ్-10 ఇన్ఫెక్షన్లు, మరణాలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. గత కొన్నిరోజులుగా రోజువారీ కరోనా కేసులు దేశంలో 20 వేలలోపు  నమోదవుతున్నాయి. బుధవారం 24 గంటల వ్యవధిలో 18,088 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి తొలిదశలో 30కోట్ల మందికి గానూ,  21 వేల కోట్ల నుంచి 27 వేల కోట్ల వ్యయం కానుందని నివేదిక తెలిపింది. అదే రెండో దశలో అయితే 50 కోట్ల టీకాలకు 35 వేల కోట్లనుంచి 45 వేల కోట్లు ఖర్చవుతందని నివేదిక తెలిపింది.
భారత్ బయోటెక్ ఇప్పటికే ఒక డోసుకు వంద రూపాయల కంటే తక్కువ ధర అవుతుందని, వాక్సినేషన్ ఖర్చును మరింత తగ్గించవచ్చని చెప్పింది.

Related Posts